Nalgonda: ఆర్టీసీ కండక్టర్ ప్రవళిక మృతి పట్ల డిపో సిబ్బంది దిగ్భ్రాంతి

Nalgonda: నల్గొండ ఆర్టీసీ డిపోలో అకాల మరణం చెందిన కండక్టర్ ప్రవళికకు కొవ్వొత్తులతో సిబ్బంది నివాళి. బాధిత కుటుంబాన్ని ఆదుకోవాలని డిమాండ్.

Saleem, Nalgonda
Published on: 4 Nov 2026 11:00 PM IST
Nalgonda
X

Nalgonda: ఆర్టీసీ కండక్టర్ ప్రవళిక మృతి పట్ల డిపో సిబ్బంది దిగ్భ్రాంతి

నల్గొండ: ఇటీవల అకాల మరణం చెందిన ఆర్టీసీ కండక్టర్ ప్రవళికకు డిపో సిబ్బంది అశ్రునయనాలతో నివాళులర్పించారు. బుధవారం రాత్రి నల్గొండ ఆర్టీసీ డిపో ప్రాంగణంలో ఏర్పాటు చేసిన సంతాప కార్యక్రమంలో ఉద్యోగులు, కార్మికులు కొవ్వొత్తులు వెలిగించి ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని మౌనం పాటించారు.

విధి నిర్వహణలో ఆమె అందించిన సేవలను స్మరించుకున్న సహచరులు, ప్రవళిక కుటుంబానికి ప్రభుత్వం, ఆర్టీసీ యాజమాన్యం తగిన ఆర్థిక సహాయం అందించి ఆదుకోవాలని ఈ సందర్భంగా డిమాండ్ చేశారు.

Saleem, Nalgonda

Saleem, Nalgonda