Nalgonda: సోలార్‌ పెట్టుకున్నా షాక్‌ కొడుతున్న కరెంటు బిల్లులు!

Nalgonda: నల్గొండ మండలం వెలుగుపల్లిలో లక్షలు వెచ్చించి సోలార్ ప్యానెల్స్ పెట్టుకున్నా సీపీడీసీఎల్ అధికారుల నిర్లక్ష్యంతో రూ.7,280 బిల్లు వచ్చింది.

Saleem, Nalgonda
Published on: 24 July 2026 7:51 PM IST
Nalgonda
X

Nalgonda: సోలార్‌ పెట్టుకున్నా షాక్‌ కొడుతున్న కరెంటు బిల్లులు!

Nalgonda: ఒకవైపు ప్రభుత్వం పునరుత్పాదక ఇంధన వాడకాన్ని, సోలార్‌ విద్యుత్‌ వ్యవస్థలను ప్రోత్సహిస్తుంటే.. మరోవైపు విద్యుత్‌ పంపిణీ సంస్థ (సీపీడీసీఎల్‌) అధికారుల వైఖరి వినియోగదారులకు చుక్కలు చూపిస్తోంది. లక్షల రూపాయలు వెచ్చించి సోలార్‌ ప్లాంట్లు ఏర్పాటు చేసుకున్నా, సాంకేతిక లోపాలు,

నెట్‌ మీటరింగ్‌ సక్రమంగా లెక్కించకపోవడంతో నెలకు వేలల్లో బిల్లులు వస్తున్నాయని ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నల్గొండ మండలం వెలుగుపల్లి గ్రామానికి చెందిన ఓ వినియోగదారుడు రూ.లక్షలు వెచ్చించి తన ఇంటిపై 6 కిలోవాట్ల సామర్థ్యంతో సోలార్ ప్యానెల్స్‌, రెండు మీటర్లను ఏర్పాటు చేసుకున్నారు. ఆయన గ్రిడ్‌కు విద్యుత్‌ను పంపుతున్నప్పటికీ, ఈ నెల ఏకంగా రూ.7,280 బిల్లు వచ్చింది.

​"మేం ఉత్పత్తి చేసి గ్రిడ్‌కు పంపే విద్యుత్‌కు ఒక ధర, మేం వాడుకునే కరెంటుకు మరో ధర లెక్కిస్తూ అధికారులు దోపిడీ చేస్తున్నారు. నెట్‌ మీటరింగ్‌ సక్రమంగా చేయకుండా అదనపు భారాలు మోపుతున్నారు."

— బాధిత వినియోగదారుడు ​అడగకుండానే కనెక్షన్‌ కట్‌! ​అధికంగా వచ్చిన బిల్లుపై అధికారులను ప్రశ్నించే లోపే, బిల్లు చెల్లించలేదనే సాకుతో ఆ ఇంటికి విద్యుత్‌ సరఫరాను నిలిపివేయడం గమనార్హం.

Saleem, Nalgonda

Saleem, Nalgonda

Next Story