Nalgonda: ఆర్మ్ బూమర్ మిషన్లతో వేగవంతమైన ఎస్ఎల్‌బీసీ టన్నెల్ పనులు

Nalgonda: నల్లగొండ జిల్లా శ్రీశైలం ఎడమగట్టు కాలువ (SLBC) టన్నెల్ తవ్వకం పనులు పునఃప్రారంభం. ఆర్మ్ బూమర్ మిషన్లతో రోజుకు 15 మీటర్ల తవ్వకమే లక్ష్యం.

Saleem, Nalgonda
Published on: 10 Nov 2026 7:56 PM IST
Nalgonda
X

Nalgonda: ఆర్మ్ బూమర్ మిషన్లతో వేగవంతమైన ఎస్ఎల్‌బీసీ టన్నెల్ పనులు

నల్లగొండ: నల్లగొండ జిల్లాలో శ్రీశైలం ఎడమగట్టు కాలువ (ఎస్ఎల్‌బీసీ) టన్నెల్ తవ్వకం పనులు మళ్లీ వేగవంతమయ్యాయి. 2025 ఫిబ్రవరిలో జరిగిన ప్రమాదం తర్వాత నిలిచిపోయిన ఈ పనులను, సరికొత్త ఆర్మ్ బూమర్ మిషన్ల సాయంతో యంత్రాంగం పరుగులు పెట్టిస్తోంది.

గతంలో రోజుకు 2-3 మీటర్లు మాత్రమే సాగిన తవ్వకం, ఇప్పుడు రెండు ఆర్మ్ బూమర్ మిషన్ల రాకతో రోజుకు 15 మీటర్లకు చేర్చాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఆధునిక సాంకేతికత, శాస్త్రవేత్తల సూచనలతో భద్రతకు పెద్దపీట వేస్తూ ఈ నెలఖారులోగా మరో కిలోమీటరు పురోగతి సాధించడమే లక్ష్యంగా అధికారులు ముందుకు సాగుతున్నారు.

Saleem, Nalgonda

Saleem, Nalgonda