Nalgonda: నల్లగొండలో గణేష్ మండపాలను తనిఖీ చేసిన ఎస్పీ శరత్ చంద్ర పవార్!
Nalgonda: నల్లగొండ జిల్లా కేంద్రంలో గణేష్ మండపాలను ఆకస్మికంగా తనిఖీ చేసిన ఎస్పీ శరత్ చంద్ర పవార్.. భద్రతా ఏర్పాట్లు, సీసీ కెమెరాలపై కీలక సూచనలు.
Nalgonda: నల్లగొండలో గణేష్ మండపాలను తనిఖీ చేసిన ఎస్పీ శరత్ చంద్ర పవార్!
Nalgonda: నల్గొండ జిల్లా కేంద్రంలో వెలసిన గణేష్ మండపాలను జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. మండపాల వద్ద భద్రతా ఏర్పాట్లను స్వయంగా పరిశీలించిన ఆయన, నిర్వాహకులతో మాట్లాడి పలు కీలక సూచనలు చేశారు.
మండపం వద్ద తప్పనిసరిగా సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని, రాత్రి వేళల్లో నిర్వాహకులు నిరంతరం అప్రమత్తంగా ఉండాలని స్పష్టం చేశారు.సున్నితమైన ప్రాంతాల్లో ప్రత్యేక పోలీస్ నిఘా ఏర్పాటు చేశామని, ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పటిష్ట బందోబస్తు నిర్వహించనున్నట్లు తెలిపారు.
వినాయక నిమజ్జనోత్సవం ప్రశాంత వాతావరణంలో పూర్తయ్యేలా ముందస్తు చర్యలు చేపట్టామని, చిన్నపాటి జాగ్రత్తలతో పెద్ద ప్రమాదాలను నివారించవచ్చని ఎస్పీ సూచించారు.




