Nalgonda: ఫిర్యాదులపై తక్షణమే స్పందించి న్యాయం చేయాలి!

Nalgonda: నల్లగొండ జిల్లా పోలీస్ కార్యాలయంలో గ్రీవెన్స్ డే నిర్వహించిన ఎస్పీ శరత్ చంద్ర పవార్. బాధితుల నుంచి 38 ఫిర్యాదుల స్వీకరణ, తక్షణ పరిష్కారానికి ఆదేశం.

Saleem, Nalgonda
Published on: 7 Sept 2026 7:35 PM IST
Nalgonda
X

Nalgonda: ఫిర్యాదులపై తక్షణమే స్పందించి న్యాయం చేయాలి!

Nalgonda: పోలీస్ గ్రీవెన్స్ కార్యక్రమానికి వచ్చే బాధితుల ఫిర్యాదులపై తక్షణమే స్పందించి, అర్హులకు న్యాయం చేయాలని జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ అధికారులను ఆదేశించారు. సోమవారం జిల్లా పోలీస్ కార్యాలయంలో నిర్వహించిన గ్రీవెన్స్ డే లో బాధితుల నుంచి ఆయన స్వయంగా దరఖాస్తులు స్వీకరించారు.

జిల్లాలోని వివిధ పోలీస్ స్టేషన్ల పరిధి నుంచి వచ్చిన 38 మంది బాధితులు తమ భూ వివాదాలు, కుటుంబ సమస్యలు, ఆర్థిక మోసాలు మరియు ఆస్తి తగాదాలకు సంబంధించిన సమస్యలను ఎస్పీ దృష్టికి తీసుకెళ్లారు.

​ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ బాధితుల ఫిర్యాదుల పరిష్కారంలో అధికారులు ఎలాంటి జాప్యం వహించవద్దన్నారు. క్షేత్రస్థాయిలో పూర్తి ఆధారాలు సేకరించి, బాధ్యులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలన్నారు.

ప్రతి ఫిర్యాదుపై దర్యాప్తు పురోగతిని బాధితులకు స్పష్టంగా తెలియజేయాలని, ప్రజలకు పోలీస్ వ్యవస్థపై నమ్మకం పెరిగేలా అధికారులు బాధ్యతాయుతంగా పనిచేయాలని స్పష్టం చేశారు.

Saleem, Nalgonda

Saleem, Nalgonda

Next Story