Nalgonda: రూప రెడ్డి హత్య స్థలాన్ని పరిశీలించిన ఎస్పీ శరత్ చంద్ర
Nalgonda: నల్లగొండ జిల్లా కొండమల్లేపల్లిలో ప్రిన్సిపాల్ రూప రెడ్డి హత్య జరిగిన ఇంటిని పరిశీలించిన ఎస్పీ శరత్ చంద్ర పవార్. మూడు బృందాలతో దర్యాప్తు.
Nalgonda: రూప రెడ్డి హత్య స్థలాన్ని పరిశీలించిన ఎస్పీ శరత్ చంద్ర
నల్లగొండ: నల్లగొండ జిల్లా కొండమల్లేపల్లి నాగార్జున గ్రామర్ కాన్సెప్ట్ స్కూల్ ప్రిన్సిపాల్ రూప రెడ్డి హత్యకు గురైన ఇంటిని జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ గురువారం పరిశీలించారు. ఇంటి పరిసరాలలో తిరిగి నిందితుడు ప్రవేశించిన విధానాన్ని హత్య చేసిన
ప్రాంతాన్ని ఆయన ఇల్లు అంతా తిరిగి క్షుణ్ణంగా పరిశీలించారు. రూప రెడ్డి భర్త రాజేందర్ రెడ్డి ని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకున్నారు. ఇంటిని క్షుణ్ణంగా పరిశీలించి హత్య జరిగిన గదిని పరిశీలించి స్థానిక పోలీసులను కూడా కేసు విషయమై విచారణ తీరును అడిగి తెలుసుకున్నారు.
అనంతరం మీడియాతో మాట్లాడుతూ మూడు బృందాలుగా పోలీస్ సిబ్బంది విచారణ చేపడుతున్నారని, సిసి ఫుటేజీ ఫింగర్ప్రింట్ తో పాటు అన్ని కోణాల్లో కేసును విచారించి నిందితుడిని గుర్తించి పట్టుకొని హత్య కేసును అతి తొందరలోనే చేదిస్తామని ఎస్పీ మీడియాకు తెలిపారు. కొండమల్లేపల్లి పోలీస్ స్టేషన్ను సందర్శించారు.




