Nalgonda: పోలీసు విధుల్లో పారదర్శకత - అవినీతికి పాల్పడితే చర్యలు ఎస్పీ
Nalgonda: నల్లగొండ జిల్లాలో పోలీస్ అధికారులతో ఎస్పీ శరత్ చంద్ర పవార్ వీడియో కాన్ఫరెన్స్. అవినీతికి పాల్పడితే కఠిన చర్యలుంటాయని హెచ్చరిక.
Nalgonda: పోలీసు విధుల్లో పారదర్శకత - అవినీతికి పాల్పడితే చర్యలు ఎస్పీ
నల్గొండ: పోలీస్ విధుల్లో పారదర్శకత, క్రమశిక్షణకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని, అవినీతికి పాల్పడితే కఠిన చర్యలు తప్పవని జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ హెచ్చరించారు. సోమవారం జిల్లాలోని పోలీస్ అధికారులు, ఎస్‌హెచ్‌ఓలతో ఆయన వీడియో కాన్ఫరెన్స్ ద్వారా శాంతిభద్రతలు, నేరాల నియంత్రణపై సమీక్ష నిర్వహించారు.
ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. పోలీసులపై ప్రజల్లో ఉన్న నమ్మకాన్ని నిలబెట్టేలా ప్రతి ఒక్కరూ అంకితభావంతో పనిచేయాలన్నారు. ఎలాంటి రాజకీయ, వ్యక్తిగత ప్రభావాలకు లోనుకాకుండా చట్టప్రకారం నిష్పక్షపాతంగా వ్యవహరించాలని ఆదేశించారు. వాహనాల తనిఖీలు, చెక్‌పోస్టులు, కేసుల దర్యాప్తులో అక్రమాలకు పాల్పడితే తీవ్రంగా పరిగణిస్తామని స్పష్టం చేశారు.




