Nalgonda: ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యం – ఎస్పీ శరత్ చంద్ర పవార్ ఐపీఎస్

Nalgonda: నల్లగొండ జిల్లా పోలీస్ గ్రీవెన్స్ డేలో ఎస్పీ శరత్ చంద్ర పవార్ 22 వినతులు స్వీకరించి, నిష్పాక్షిక విచారణతో బాధితులకు న్యాయం చేయాలని ఆదేశించారు.

Saleem, Nalgonda
Published on: 9 Nov 2026 5:47 PM IST
Nalgonda
X

Nalgonda: ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యం – ఎస్పీ శరత్ చంద్ర పవార్ ఐపీఎస్

నల్లగొండ: జిల్లా పోలీసు కార్యాలయంలో సోమవారం నిర్వహించిన పోలీస్ గ్రీవెన్స్ డే కార్యక్రమంలో జిల్లా వ్యాప్తంగా వివిధ పోలీస్ స్టేషన్ పరిధుల నుంచి వచ్చిన 22 మంది బాధితులు తమ సమస్యలకు సంబంధించిన వినతిపత్రాలను జిల్లా ఎస్పీ గారికి అందజేశారు.

ఈ సందర్భంగా ప్రతి బాధితుడి ఫిర్యాదును జిల్లా ఎస్పీ గారు స్వయంగా పరిశీలించి, వారి సమస్యలను విని, సంబంధిత పోలీసు అధికారులతో మాట్లాడి చట్టపరంగా, నిష్పాక్షికంగా విచారణ జరిపి త్వరితగతిన తగిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.

భూ వివాదాలు, కుటుంబ కలహాలు, మోసం, ఆర్థిక లావాదేవీలు, ఇతర వ్యక్తిగత సమస్యలకు సంబంధించిన వినతులను స్వీకరించి, ప్రతి ఫిర్యాదుపై పారదర్శకంగా విచారణ చేపట్టి బాధితులకు న్యాయం జరిగేలా చర్యలు తీసుకుంటామని జిల్లా ఎస్పీ గారు తెలిపారు.

పోలీస్ శాఖ ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటుందని, బాధితులు తమ సమస్యల పరిష్కారం కోసం ప్రతి సోమవారం నిర్వహించే పోలీస్ గ్రీవెన్స్ డేను వినియోగించుకోవాలని జిల్లా ఎస్పీ గారు సూచించారు.

Saleem, Nalgonda

Saleem, Nalgonda