Nalgonda: పాఠశాలలో చిన్నారికి గాయాలు.. యాజమాన్యం నిర్లక్ష్యం

Nalgonda: నల్లగొండ జిల్లా శాలిగౌరారం జేఎంజే పాఠశాలలో మెట్లపై నుంచి జారిపడి చిన్నారికి తీవ్ర గాయాలయ్యాయి. యాజమాన్యం నిర్లక్ష్యంపై తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేశారు.

PARAMESH, NALGONDA & SURYAPET
Published on: 14 Nov 2026 7:08 PM IST
Nalgonda
X

Nalgonda: పాఠశాలలో చిన్నారికి గాయాలు.. యాజమాన్యం నిర్లక్ష్యం

నల్లగొండ: ​బాలల దినోత్సవం రోజునే ఒక ప్రైవేట్ పాఠశాల యాజమాన్యం నిర్లక్ష్యం చిన్నారి పాలిట శాపంగా మారింది. నల్లగొండ జిల్లా శాలిగౌరారం మండల కేంద్రంలోని జేఎంజే ప్రైవేట్ పాఠశాలలో చదువుతున్న చిన్నారులకు కనీస భద్రత కరువైంది. ఒకటో తరగతి గదిని మొదటి అంతస్తులో ఏర్పాటు చేయడంతో.. కిందికి దిగే క్రమంలో విద్యార్థులు ఒకరినొకరు తోసుకున్నారు. ఈ ఘటనలో గుర్జాల గ్రామానికి చెందిన ఓ చిన్నారి మెట్లపై నుంచి జారిపడి తీవ్రంగా గాయపడింది.

​అయితే, పాపకు గాయాలైనా యాజమాన్యం కనీసం తల్లిదండ్రులకు సమాచారం ఇవ్వకుండా కాలయాపన చేసింది. పాఠశాలకు వచ్చిన చిన్నారి తండ్రి.. పాపకు తగిలిన గాయాలను చూసి ప్రిన్సిపాల్, కరస్పాండెంట్లను నిలదీశారు.

కానీ, వారు బాధ్యతారాహిత్యంగా "చిన్న దెబ్బే కదా.. ఇంటికి తీసుకెళ్లండి" అంటూ నిర్లక్ష్యపు సమాధానం ఇచ్చారని తండ్రి ఆవేదన వ్యక్తం చేశారు. బాధ్యులపై అధికారులు తక్షణమే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.

PARAMESH, NALGONDA & SURYAPET

PARAMESH, NALGONDA & SURYAPET