Nalgonda: సోషల్ వెల్ఫేర్ జోనల్ ఆఫీస్‌లో అధికారుల నిర్లక్ష్యం
Nalgonda: తెలంగాణ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ జోనల్ ఆఫీస్‌లో సమయపాలన కొరవడింది. ఉదయం 10:30 గంటలు దాటినా కార్యాలయం తెరవకపోవడంతో దూరప్రాంతాల నుంచి వచ్చిన ప్రజలు
Nalgonda: సోషల్ వెల్ఫేర్ జోనల్ ఆఫీస్‌లో అధికారుల నిర్లక్ష్యం
నల్గొండ: పాలనపై నిర్లక్ష్యం.. జవాబుదారీతనం ఏదీ?
ఉదయం 10:30 గంటలు దాటినా తలుపులు తెరుచుకోని తెలంగాణ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ జోనల్ కార్యాలయ దుస్థితి ప్రభుత్వ ఉద్యోగుల నిర్లక్ష్యానికి అద్దం పడుతోంది.
పనుల నిమిత్తం సుదూర ప్రాంతాల నుంచి వచ్చే సామాన్య ప్రజలు, విద్యార్థుల తల్లిదండ్రులు కార్యాలయం వద్ద గంటల తరబడి వేచి చూడాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది. జిల్లా అధికారులు, కలెక్టర్లు, జేసీల పర్యవేక్షణ లోపించడమే ఈ అవ్యవస్థకు ప్రధాన కారణమనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
ప్రభుత్వ సమయపాలన పట్ల బాధ్యత లేకుండా, ఉన్నతాధికారుల భయం కూడా లేకుండా వ్యవహరిస్తున్న ఇటువంటి అధికారులపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.
Next Story




