Chintapally: పాస్టర్ కుటుంబంపై దాడికి పాల్పడిన వారిని శిక్షించాలి
Chintapally: కుర్మేడులో ప్రార్థనలు చేసుకుంటున్న పాస్టర్ కుటుంబంపై దాడి చేసిన వారిని కఠినంగా శిక్షించాలని నల్లగొండ కలెక్టరేట్ ఎదుట యూడీసీఎఫ్ నాయకులు నిరసన.
Chintapally: పాస్టర్ కుటుంబంపై దాడికి పాల్పడిన వారిని శిక్షించాలి
చింతపల్లి: నల్లగొండ జిల్లా చింతపల్లి మండలం కుర్మేడు గ్రామంలో స్వగృహంలో ప్రార్థనలు చేసుకుంటున్న పాస్టర్ కుటుంబంపై దాడికి పాల్పడిన వారిని వెంటనే గుర్తించి కఠినంగా శిక్షించాలని యునైటెడ్ దళిత క్రిస్టియన్ ఫెడరేషన్ (యూడీసీఎఫ్) జిల్లా ప్రధాన కార్యదర్శి పెదామాము డేవిడ్ రాజు, సాగర్ నియోజకవర్గ పాస్టర్ ఫెలోషిప్ అధ్యక్షుడు దుబ్బ డేవిడ్ రాజ్ డిమాండ్ చేశారు. బుధవారం నల్లగొండ కలెక్టరేట్లో జిల్లా కలెక్టర్కు వినతిపత్రం సమర్పించిన అనంతరం వారు నిరసన తెలిపారు.
ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ.. పాస్టర్ నివాసంలో కుటుంబ సభ్యులు, విశ్వాసులతో కలిసి ప్రార్థనలు నిర్వహిస్తుండగా కొందరు యువకులు అక్రమంగా ప్రవేశించి దౌర్జన్యానికి దిగారని ఆరోపించారు.
ఈ ఘటనతో అక్కడున్న మహిళలు, యువకులు తీవ్ర భయాందోళనకు గురయ్యారని ఆవేదన వ్యక్తం చేశారు. బాధితులకు న్యాయం చేయాలని, దాడికి బాధ్యులైన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరారు.




