Nalgonda: మాడుగులపల్లి-చెరువుపల్లి రోడ్డు జలమయం: తీవ్ర ఇబ్బందులు
Nalgonda: మాడుగులపల్లి-చెరువుపల్లి రోడ్డు వర్షానికి జలమయమై గుంతలమయంగా మారుతోంది. తీవ్ర ఇబ్బందులు పడుతున్న వాహనదారులు కొత్త రోడ్డు నిర్మించాలని డిమాండ్
Nalgonda: మాడుగులపల్లి-చెరువుపల్లి రోడ్డు జలమయం: తీవ్ర ఇబ్బందులు
నల్లగొండ జిల్లా
మాడుగులపల్లి: చిన్నపాటి వర్షానికే మాడుగులపల్లి-చెరువుపల్లి ప్రధాన రహదారి జలమయమై గుంతలమయంగా మారుతోంది. రహదారిపై నిలిచిన నీటిలో గుంతలు కనిపించక వాహనదారులు, బాటసారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ప్రాణాలను గుప్పిట్లో పెట్టుకుని ప్రయాణించాల్సి వస్తోందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
అధికారులు, ప్రజాప్రతినిధులు వెంటనే స్పందించి ఈ రహదారికి శాశ్వత పరిష్కారం చూపాలని, నూతన రోడ్డు నిర్మాణం చేపట్టాలని మాడుగులపల్లి మండల ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.
Next Story




