Nalgonda: నూతన చట్టాలపై నల్సార్ ఫ్యాకల్టీ డాక్టర్ బాలకృష్ణ దిశానిర్దేశం
Nalgonda: ఐఏఎల్ ఆధ్వర్యంలో జరిగిన సదస్సులో నల్సార్ ఫ్యాకల్టీ డాక్టర్ బాలకృష్ణ పాల్గొని, న్యాయవాదులు బిఎన్ఎస్ (BNS) నూతన చట్టాలపై అవగాహన పెంచుకోవాలన్నారు.
Nalgonda: నూతన చట్టాలపై నల్సార్ ఫ్యాకల్టీ డాక్టర్ బాలకృష్ణ దిశానిర్దేశం
నల్గొండ: సమాజంలో వేగంగా మారుతున్న నేరాల స్వరూపానికి అనుగుణంగా న్యాయవాదులు నూతన చట్టాలు, సాంకేతికతపై నిరంతరం అవగాహన పెంపొందించుకోవాలని నల్సార్ లా యూనివర్సిటీ ఫ్యాకల్టీ డాక్టర్ డి.బాలకృష్ణ పిలుపునిచ్చారు. శనివారం నల్లగొండ బార్ అసోసియేషన్ హాల్‌లో ‘ఆధునిక నేరాలు- క్రిమినల్ న్యాయవ్యవస్థ’ అంశంపై ఐఏఎల్, బార్ అసోసియేషన్ సంయుక్త ఆధ్వర్యంలో అవగాహన సదస్సు నిర్వహించారు. ఐఏఎల్ జిల్లా అధ్యక్షుడు కట్టా అనంతరెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమానికి బాలకృష్ణ ముఖ్య వక్తగా హాజరై మాట్లాడారు.
ప్రస్తుతం సాంప్రదాయ నేరాలతో పాటు సైబర్ మోసాలు, కృత్రిమ మేధ (ఏఐ) దుర్వినియోగం, డీప్‌ఫేక్‌లు, డేటా చోరీ వంటి ఆధునిక సవాళ్లు పెరుగుతున్నాయని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. నూతనంగా అమల్లోకి వచ్చిన భారతీయ న్యాయ సంహిత (BNS), భారతీయ నాగరిక సురక్షా సంహిత (BNSS), భారతీయ సాక్ష్య అధినియమం (BSA)లను న్యాయవాదులు లోతుగా అధ్యయనం చేయాలన్నారు.




