Nalgonda: నార్కట్పల్లిలో వినూత్న నిరసన: సీఎం దృష్టికి రోడ్డు సమస్య
Nalgonda: నల్లగొండ జిల్లా నార్కట్పల్లిలో అసంపూర్తి రోడ్డు పనులు పూర్తిచేయాలని వినాయకుడి వద్ద సీఎం రేవంత్ రెడ్డి ఫోటో ఉంచి స్థానిక మహిళలు వినూత్నంగా పూజలు చేశారు.
Nalgonda: నార్కట్పల్లిలో వినూత్న నిరసన: సీఎం దృష్టికి రోడ్డు సమస్య
Nalgonda: మా రోడ్డు పనులకు ఉన్న అడ్డంకులు తొలగించి త్వరగా పనులు పూర్తి చేసే విధంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి చెప్పమని వినాయక మండపంలో ప్రత్యేక పూజలు చేసిన మహిళలు.
నల్లగొండలో నార్కట్ పల్లి మండల కేంద్రంలో రోడ్డు విస్తరణ పనులు ఐదు సంవత్సరాల క్రితం మొదలుపెట్టి సగం పనులు చేసి అసంపూర్తిగా వదిలేశారు దాంతో ఆక్కడ ప్రజలు నిత్యం ప్రమాదాలకు గురై కొంతమంది గాయపడగా మరి కొందరు మరణించారు.
అంతేకాకుండా వ్యాపార సంస్థలు రోడ్డుపై నుండి వస్తున్న దుమ్ముతో చాలా ఇబ్బంది పడుతున్నారు దాంతో ఈరోజు జరిగే వినాయక మండపంలోని పూజలో వినాయకుని పైన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఫోటో పెట్టి మా బాధను ముఖ్యమంత్రి గారికి చేరవేయమని గ్రామ మహిళలు వినతి పత్రాలను వినాయక మండపంలో ఉన్న ముఖ్యమంత్రి కి ఫోటోకు అందజేశారు.
ఇప్పటికైనా అధికారులు మా రోడ్డుపై దృష్టి పెట్టి రోడ్డు పనులు పూర్తిచేసే విధంగా వారికి మంచి బుద్ధుని కలిగించాలని స్థానిక మహిళలు వినాయకునికి పూజలు చేశారు.




