Nalgonda: భూకబ్జాదారులపై చర్యలు తీసుకోండి: బాధితుల కలెక్టర్‌కు వినతి!

Nalgonda: నర్సింగ్‌భట్లలో పేద రైతుల భూములను కబ్జా చేస్తూ రెవెన్యూ రికార్డులు తారుమారు చేస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని బాధిత రైతులు కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు.

Saleem, Nalgonda
Published on: 17 Aug 2026 4:18 PM IST
Nalgonda
X

Nalgonda: భూకబ్జాదారులపై చర్యలు తీసుకోండి: బాధితుల కలెక్టర్‌కు వినతి!

​నల్గొండ: నర్సింగ్‌భట్ల గ్రామంలో పేద రైతుల భూములను అక్రమంగా ఆక్రమించి, రెవెన్యూ రికార్డులను తారుమారు చేస్తున్న వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని నర్సింగ్‌భట్ల, పాతూరు, చెన్నుగూడెం గ్రామాల బాధితులు నల్గొండ జిల్లా కలెక్టర్‌కు విన్నవించారు.

​స్థానిక సర్పంచ్ భర్త అధికారాన్ని అడ్డుపెట్టుకొని భూతగాదాలు సృష్టిస్తూ, నకిలీ మరణ ధ్రువీకరణ పత్రాలతో పట్టామార్పిడులు చేయిస్తున్నారని ఆరోపించారు. ప్రశ్నిస్తే బెదిరింపులు, భౌతిక దాడులకు దిగుతున్నారని తెలిపారు. దీనిపై సమగ్ర విచారణ జరిపి తమకు న్యాయం చేయాలని బాధితులు కోరారు.

Saleem, Nalgonda

Saleem, Nalgonda

Next Story