NEET UG 2026: నీట్ యూజీ రీ-ఎగ్జామ్ దివ్యాంగులకు 65 నిమిషాల అదనపు సమయం!

NEET UG 2026: ఈనెల 21న జరగనున్న ‘నీట్ యూజీ-2026’ పునఃపరీక్షపై జిల్లా కలెక్టర్ బి. చంద్రశేఖర్ సమీక్ష.

SALEEM, BANSWADA
Published on: 19 Jun 2026 6:49 PM IST
NEET UG 2026
X

NEET UG 2026: నీట్ యూజీ రీ-ఎగ్జామ్ దివ్యాంగులకు 65 నిమిషాల అదనపు సమయం!

NEET UG 2026: ఈనెల 21న నిర్వహించనున్న ‘నీట్ యూజీ-2026’ పునఃపరీక్షను జిల్లాలో అత్యంత పకడ్బందీగా నిర్వహించాలని కలెక్టర్ బి. చంద్రశేఖర్ అధికారులను ఆదేశించారు. శుక్రవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) మార్గదర్శకాల ప్రకారం పరీక్ష నిర్వహణపై సంబంధిత అధికారులతో ఆయన సమీక్షా సమావేశం నిర్వహించారు.

మధ్యాహ్నం 2:00 గంటల నుండి సాయంత్రం 5:15 గంటల వరకు పరీక్ష జరుగుతుందని తెలిపారు. గత పరీక్షతో పోలిస్తే ఈసారి అభ్యర్థులకు 15 నిమిషాలు, దివ్యాంగులకు 65 నిమిషాలు (సాయంత్రం 6:20 వరకు) అదనపు సమయం కేటాయించినట్లు వెల్లడించారు. భద్రత కోసం అన్ని సెంటర్లలో సిఆర్పిఎఫ్ బలగాలను నియమించామన్నారు.

SALEEM, BANSWADA

SALEEM, BANSWADA

Next Story