Neredugommu: నేరేడుగొమ్ము హెచ్‌ఎంపై ఆరోపణలు అసత్యం
Neredugommu: నేరేడుగొమ్ము హెచ్‌ఎం శ్రీనివాస్‌పై వచ్చిన ఆరోపణలను యూటీఎఫ్ నాయకులు ఖండించారు. ఎంఈఓ సన్మానం ఉపాధ్యాయులందరి అంగీకారంతోనే జరిగిందన్నారు.
Neredugommu: నేరేడుగొమ్ము హెచ్‌ఎంపై ఆరోపణలు అసత్యం
నేరేడుగొమ్ము: నేరేడుగొమ్ము హెడ్మాస్టర్ తులా శ్రీనివాస్‌పై బలవంతపు వసూళ్ల ఆరోపణలతో వచ్చిన వార్తలు నిరాధారమని తెలంగాణ రాష్ట్ర ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ అధ్యక్షుడు జానకిరామయ్య, ప్రధాన కార్యదర్శి కట్ట బోయిన సైదయ్య ఖండించారు.
విచారణ చేయకుండా వార్తలు రాయడం విచారకరమన్నారు. మండల విద్యాధికారికి సన్మానం చేయాలని ఉపాధ్యాయులందరి అంగీకారంతోనే నిర్ణయించామని, ఇందులో బలవంతపు వసూళ్లు లేవని స్పష్టం చేశారు.




