Kondamallepalli: కొండమల్లేపల్లిలో ప్రజల తాగునీటి కోసం నూతన బోర్లు ఏర్పాటు!
Kondamallepalli: నల్గొండ జిల్లా కొండమల్లేపల్లి మండల కేంద్రంలో ప్రజల తాగునీటి అవసరాల కోసం నూతన బోర్లు ఏర్పాటు.. సర్పంచ్ యుగంధర్ రెడ్డి.
Kondamallepalli: కొండమల్లేపల్లిలో ప్రజల తాగునీటి కోసం నూతన బోర్లు ఏర్పాటు!
Kondamallepalli: నల్గొండ జిల్లా కొండమల్లేపల్లి మండల కేంద్రంలోని 8, 10వ వార్డుల్లో ప్రజల అవసరాలను దృష్టిలో ఉంచుకుని నూతనంగా బోర్లు వేయించారు. సర్పంచి యుగంధర్ రెడ్డి ఆధ్వర్యంలో, వార్డు సభ్యులు గంట మల్లేష్, బిజిలి లింగం సహకారంతో బోర్ల ఏర్పాటు కార్యక్రమం జరిగింది.
ఈ కార్యక్రమంలో వార్డు ప్రజలు రాజు, చిట్టి, ధనమ్మ, సాయిబాబా రాజు తదితరులు పాల్గొన్నారు. తమ సమస్యను పరిష్కరించి ప్రజల అవసరాలకు అనుగుణంగా నూతన బోర్లు ఏర్పాటు చేయించిన సర్పంచి యుగంధర్ రెడ్డి, వార్డు సభ్యులకు కాలనీవాసులు కృతజ్ఞతలు తెలిపారు.
తమ సమస్యను పరిష్కరించినందుకు సర్పంచి, వార్డు సభ్యులకు ఎల్లవేళలా అండగా ఉంటామని గ్రామస్తులు పేర్కొన్నారు. నూతన బోర్లు ఏర్పాటు కావడంతో వార్డు ప్రజలు ఆనందం వ్యక్తం చేశారు.




