Nidamanoor: ముదిమాణిక్యం కాల్వకు సాగునీరు విడుదల!

Nidamanoor: నల్గొండ జిల్లా నిడమనూరు మండలం ముదిమాణిక్యం కాల్వ ద్వారా 250 క్యూసెక్కుల సాగునీరు విడుదలైంది. దీనివల్ల 1000 ఎకరాల ఆయకట్టుకు లబ్ధి చేకూరనుంది.

హెచ్ఎం డిజిటల్ డెస్క్
Published on: 26 Jun 2026 7:00 PM IST
Nidamanoor
X

Nidamanoor: ముదిమాణిక్యం కాల్వకు సాగునీరు విడుదల!

నిడమానూరు: నల్గొండ జిల్లా నిడమనూరు మండలం ఎడమ కాలువ పరిధిలోని రైతులకు సాగునీటి కష్టాలు తీరాయి. రైతాంగ అవసరాల నిమిత్తం ముదిమాణిక్యం కాల్వ ద్వారా ఇరిగేషన్ శాఖ అధికారులు 250 క్యూసెక్కుల నీటిని శుక్రవారం విడుదల చేశారు.

​ఈ నీటి పారుదల ద్వారా నిడమనూరు మండల పరిధిలోని సుమారు 1000 ఎకరాల ఆయకట్టుకు సాగునీరు అందనుంది. కాల్వకు నీరు చేరడంతో మండలంలోని బంకపురం, రాజన్నగూడెం, శాఖపురం, తుమ్మడం సహా పలు గ్రామాల రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. పంటలు సమృద్ధిగా పండుతాయని ధీమా వ్యక్తం చేస్తూ, సకాలంలో నీరందించిన అధికారులకు కృతజ్ఞతలు తెలుపుతున్నారు.

హెచ్ఎం డిజిటల్ డెస్క్

హెచ్ఎం డిజిటల్ డెస్క్

Next Story