Nalgonda: రూప్లా తండాలో భగ్గుమన్న పాత కక్షలు..ఇరువర్గాల దాడిలో 8 మందికి గాయాలు!
Nalgonda: నల్గొండ జిల్లా త్రిపురారం మండలం రూప్లా తండాలో పాత కక్షలతో రెండు వర్గాల మధ్య ఘర్షణ. కర్రలు, రాళ్లతో దాడి.. 8 మందికి తీవ్ర గాయాలు.
Nalgonda: రూప్లా తండాలో భగ్గుమన్న పాత కక్షలు..ఇరువర్గాల దాడిలో 8 మందికి గాయాలు!
Nalgonda: నల్గొండ జిల్లా త్రిపురారం మండలం రూప్లా తండాలో పాత కక్షలు మళ్లీ భగ్గుమన్నాయి. గ్రామంలోని రెండు వర్గాల మధ్య తీవ్ర వివాదం చెలరేగి పరస్పరం కర్రలు, రాళ్లతో దాడులకు దిగారు.
ఈ దాడిలో 8మందికి తీవ్ర గాయాలయ్యాయి. గమనించిన స్థానికులు వెంటనే స్పందించి గాయపడిన వారిని చికిత్స నిమిత్తం సమీప ఏరియా ఆసుపత్రికి తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షిస్తున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని విచారణ జరుపుతున్నారు. ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.




