Suryapet: కోదాడలో 548 డబుల్ ఇళ్ల పట్టాలు పంపిణీ చేసిన పద్మావతి రెడ్డి!
Suryapet: సూర్యాపేట జిల్లా కోదాడలో 548 మంది అర్హులైన పేదలకు డబుల్ బెడ్రూమ్ ఇళ్ల పట్టాలు, తాళాలను ఎమ్మెల్యే పద్మావతి రెడ్డి అందజేశారు.
Suryapet: కోదాడలో 548 డబుల్ ఇళ్ల పట్టాలు పంపిణీ చేసిన పద్మావతి రెడ్డి!
Suryapet: కోదాడ పట్టణంలోని బాలాజీనగర్‌లో గత ప్రభుత్వం నిర్మించి వదిలేసిన డబుల్ బెడ్రూమ్ ఇళ్లకు కాంగ్రెస్ ప్రభుత్వం అవసరమైన మౌలిక వసతులు కల్పించింది. స్థానిక పెరిక భవన్‌లో కోదాడ ఎమ్మెల్యే పద్మావతి రెడ్డి ఈ రోజు అర్హులైన పేదలకు ఇళ్ల పట్టాలను పంపిణీ చేశారు. ఈ తొలి విడత కార్యక్రమంలో భాగంగా సుమారు 548 మంది లబ్ధిదారులను పరిశీలించి వారికి ఇళ్ల పట్టాలు, ఇంటి తాళం చెవులు మరియు మున్సిపల్ నంబర్ పత్రాలను అందజేశారు.
గత ప్రభుత్వ హయాంలో ఈ ఇండ్లకు మౌళిక సదుపాయాలు లేక అసంపూర్తిగా నిలిచిపోవడంతో, విద్యుత్ సబ్‌స్టేషన్, మీటర్లు, డ్రైనేజీ పైపులైన్ల పనులన్నింటినీ కాంగ్రెస్ ప్రభుత్వం ప్రత్యేక నిధులతో పూర్తి చేయించిందని ఎమ్మెల్యే తెలిపారు. లబ్ధిదారులు అందరూ ఆగస్టు 15 లోపు తమ గృహ ప్రవేశాలు పూర్తి చేసుకోవాలని ఆమె పిలుపునిచ్చారు.
అలాగే, కోదాడ టౌన్‌లో మిగిలిన 500 ఇళ్ల వెరిఫికేషన్ ప్రక్రియను కూడా త్వరలోనే పూర్తి చేసి అర్హులైన పేదలకు అందజేస్తామని వెల్లడించారు.ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే చందర్ రావు,ఆర్టీఓ సూర్య నారాయణ,ఎమ్మార్వో సంతోష్ కిరణ్, చైర్ పర్సన్ ఎర్నేని కుసుమ వెంకటరత్నం బాబు, వైస్ చైర్మన్ మల్లీశ్వరి, వార్డు కౌన్సిలర్లు, మాజీ కౌన్సిలర్లు, లబ్ధిదారులు పాల్గొన్నారు.




