Palakeveedu: తహసీల్దార్ ఆఫీస్‌కే తాళం.. సూర్యాపేటలో వింత ఘటన!
Palakeveedu: సూర్యాపేట జిల్లా పాలకవీడు తహసీల్దార్ ఆఫీస్‌కు యజమాని తాళం వేశారు. రెండేళ్లుగా అద్దె చెల్లించలేదని, బకాయిలు ఇస్తేనే తెరుస్తానని స్పష్టం చేశారు.
Palakeveedu: తహసీల్దార్ ఆఫీస్‌కే తాళం.. సూర్యాపేటలో వింత ఘటన!
సూర్యాపేట జిల్లా: పాలకవీడు తహసీల్దార్ కార్యాలయానికి ఇంటి యజమాని జనార్దన్‌రెడ్డి తాళం వేసిన ఘటన చోటుచేసుకుంది. గత రెండు సంవత్సరాలుగా కార్యాలయానికి సంబంధించిన ఇంటి అద్దె చెల్లించడం లేదని ఆయన ఆరోపించారు.
అద్దె బకాయిలు చెల్లించాలని ఇప్పటికే కలెక్టర్, ఆర్డీవోకు తన సమస్యను తెలియజేసినట్లు జనార్దన్‌రెడ్డి తెలిపారు. జాయింట్ కలెక్టర్‌ను కలిసి అద్దె చెల్లించాలని కోరినప్పటికీ, జీవో పేపర్ తీసుకురావాలని అధికారులు సూచిస్తున్నారని ఆయన పేర్కొన్నారు.
అద్దె బకాయిలు చెల్లించక చాలా రోజులు గడిచిందని, అద్దె చెల్లించిన తర్వాతే తాళం తీస్తానని ఇంటి యజమాని స్పష్టం చేశారు. దీంతో తహసీల్దార్ కార్యాలయానికి తాళం పడటంతో కార్యాలయానికి వచ్చే ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
అధికారులు ఈ సమస్యను పరిష్కరించి కార్యాలయ కార్యకలాపాలు యథావిధిగా కొనసాగించేలా చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.




