Nalgonda: అన్నేపర్తి 12వ టీజీఎస్పీ బెటాలియన్లో ఘనంగా పండుగ సాయన్న జయంతి!
Nalgonda: నల్లగొండ జిల్లా అన్నేపర్తి 12వ టీజీఎస్పీ బెటాలియన్లో ఘనంగా పండుగ సాయన్న జయంతి. నివాళులర్పించిన కమాండెంట్ బి. రామకృష్ణ, అధికారులు.
Nalgonda: అన్నేపర్తి 12వ టీజీఎస్పీ బెటాలియన్లో ఘనంగా పండుగ సాయన్న జయంతి!
Nalgonda: అన్నేపర్తిలోని 12వ టీజీఎస్పీ బెటాలియన్లో ప్రజాపోరాట యోధుడు పండుగ సాయన్న ముదిరాజ్ జయంతి వేడుకలను గురువారం ఘనంగా నిర్వహించారు. బెటాలియన్ కమాండెంట్ బి.రామకృష్ణ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో సాయన్న చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.
ఈ సందర్భంగా కమాండెంట్ ಮಾತలాడుతూ.. సమాజ శ్రేయస్సు కోసం, ప్రజల ఆత్మగౌరవం కోసం సాయన్న చూపిన ధైర్యసాహసాలు, పోరాట స్ఫూర్తి నేటి యువతకు ఆదర్శనీయమన్నారు. ప్రజాసేవలో ఆయన చూపిన బాటలో ప్రతి ఒక్కరూ పయనించాలని పిలుపునిచ్చారు.
కార్యక్రమంలో అదనపు కమాండెంట్ ఎల్.నాగేశ్వరరావు, అసిస్టెంట్ కమాండెంట్లు నర్సింగ్ వెంకన్న, కె.మహేందర్, ఏఓ దయాకర్, వైద్యధికారులు షర్మిలాదేవి, నితిన్ గౌతమ్, ఆర్ఐలు, ఆర్ఎస్ఐలు, బెటాలియన్ సిబ్బంది పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.




