Suryapet: సూర్యాపేట దేవాలయ నిర్మాణానికి పటేల్ రమేష్ రెడ్డి విరాళం
Suryapet: సూర్యాపేట జిల్లాలో ప్రసన్నాంజనేయ స్వామి ఆలయానికి రూ.50 వేల విరాళం అందించిన మాజీ చైర్మన్ పటేల్ రమేష్ రెడ్డి. ఆధ్యాత్మిక సేవే లక్ష్యమని ఆయన పిలుపు.
Suryapet: సూర్యాపేట దేవాలయ నిర్మాణానికి పటేల్ రమేష్ రెడ్డి విరాళం
సూర్యాపేట: తెలంగాణ రాష్ట్ర పర్యాటక అభివృద్ధి సంస్థ మాజీ చైర్మన్ పటేల్ రమేష్ రెడ్డి శనివారం సూర్యాపేట జిల్లా కేంద్రంలోని తన నివాసంలో రూ.50 వేల ఆర్థిక సహాయం అందజేశారు. పెన్‌పహాడ్ మండలం మేఘ్య తండా గ్రామ పంచాయతీ పరిధిలోని గంగలి తండాలో నిర్మాణంలో ఉన్న శ్రీ శ్రీశ్రీ ప్రసన్నాంజనేయ స్వామి దేవాలయానికి ఈ విరాళాన్ని అందించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆధ్యాత్మిక కేంద్రాల అభివృద్ధికి ప్రతి ఒక్కరూ సహకరించాలని పిలుపునిచ్చారు. దేవాలయాలు సమాజంలో ఐక్యత, భక్తి భావాలను పెంపొందించే కేంద్రాలు అని అన్నారు. గ్రామ ప్రజల సహకారంతో దేవాలయ నిర్మాణం త్వరగా పూర్తై భక్తులకు అందుబాటులోకి రావాలని ఆకాంక్షించారు.
ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటూ వారి అవసరాలు, సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని, సమాజ సేవతో పాటు ఆధ్యాత్మిక కార్యక్రమాలకు నిరంతరం సహకారం అందిస్తానని తెలిపారు.మార్చి 25న దేవాలయ భూమిపూజ కార్యక్రమానికి హాజరైనప్పుడు ఇచ్చిన మాటను నిలబెట్టుకుని నేడు ఆర్థిక సహాయం అందించడం సంతోషంగా ఉందని మేఘ్య తండా సర్పంచ్ భూక్య రాజు నాయక్ అన్నారు. దేవాలయ నిర్మాణానికి ఆయన అందించిన సహకారానికి గ్రామ ప్రజల తరఫున కృతజ్ఞతలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో ఉపసర్పంచ్ మాలోతు వరలక్ష్మి వెంకన్న, సిద్దు, శోభన్, మురళి, రమేష్ తదితరులు పాల్గొన్నారు.




