Suryapet: పెద్దగట్టు జాతర తేదీలు ఖరారు.. 2027 ఫిబ్రవరి 21 నుండి 25 వరకు వేడుకలు!
Suryapet: దూరాజ్‌పల్లి శ్రీ లింగమంతుల స్వామి (పెద్దగట్టు) జాతర తేదీలు ఖరారయ్యాయి. 2027 ఫిబ్రవరి 21 నుండి 25 వరకు ఐదు రోజుల పాటు ఈ మహాజాతర జరగనుంది.
Suryapet: పెద్దగట్టు జాతర తేదీలు ఖరారు.. 2027 ఫిబ్రవరి 21 నుండి 25 వరకు వేడుకలు!
Suryapet: తెలంగాణ రాష్ట్రంలో రెండవ అతిపెద్ద జాతరగా ప్రసిద్ధి చెందిన దూరాజ్‌పల్లి శ్రీశ్రీశ్రీ లింగమంతుల స్వామి (పెద్దగట్టు) జాతర నిర్వహణ తేదీలు ఖరారయ్యాయి. 2027 ఫిబ్రవరి 21 నుండి 25 వరకు జాతర జరగనుంది.
ఫిబ్రవరి 21న సూర్యాపేట మండలం కేసారం నుండి దేవరపెట్టెను పెద్దగట్టు పైకి చేర్చడం, గంపల ప్రదక్షణ నిర్వహించనున్నారు. 22న స్వామివారికి బోనాల సమర్పణ, 23న చంద్రపట్నం కార్యక్రమం, 24న నెలవారం నిర్వహణ, దేవరపెట్టెను తిరిగి కేసారంకు తరలించడం, 25న జాతర ముగింపు కార్యక్రమం జరగనున్నట్లు నిర్వాహకులు తెలిపారు.
ఇదిలా ఉండగా పెద్దగట్టు జాతరకు రూ.100 కోట్ల నిధులు కేటాయించాలని రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు వూర రామ్మూర్తి యాదవ్ నేతృత్వంలోని యాదవ సంఘం నాయకులు వినతిపత్రం అందించారు. నల్లగొండ-ఖమ్మం-వరంగల్ పట్టభద్రుల శాసనమండలి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి రాంరెడ్డి సర్వోత్తమ్ రెడ్డికి వినతిపత్రం అందజేసి, రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, జిల్లా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ద్వారా నిధులు మంజూరు చేయించాలని కోరారు.
జాతర నిర్వహణకు అవసరమైన అభివృద్ధి పనులు, భక్తులకు మౌలిక సదుపాయాల కల్పన కోసం నిధులు మంజూరు చేయాలని వారు విజ్ఞప్తి చేశారు.




