Nalgonda: పెద్దవూరలో లక్షలు వెచ్చించిన మహిళా శిక్షణ కేంద్రం నిరుపయోగం!
Nalgonda: పెద్దవూర మండల కేంద్రంలో రూ.లక్షలు వెచ్చించి నిర్మించిన క్లస్టర్ లెవెల్ రిసోర్స్ సెంటర్ (CLRC) భవనం అధికారుల నిర్లక్ష్యంతో నిరుపయోగంగా మారి శిథిలావస్థకు చేరింది.
Nalgonda: పెద్దవూరలో లక్షలు వెచ్చించిన మహిళా శిక్షణ కేంద్రం నిరుపయోగం!
Nalgonda: లక్షలు వెచ్చించి నిర్మించిన ఆ భవనం నేడు నిరుపయోగంగా మారింది. మహిళలకు ఉపాధి మార్గాలు చూపి, వారికి ఆర్థిక సమృద్ధి అందించాల్సిన కేంద్రం అధికారుల పర్యవేక్షణ లేక శిథిలావస్థకు చేరింది.
నల్లగొండ జిల్లా పెద్దవూర మండల కేంద్రంలో 2007లో రూ.లక్షల ప్రజాధనంతో సమాఖ్య మహిళా శిక్షణ కేంద్రాన్ని (CLRC) ప్రారంభించారు. స్వయం సహాయక సంఘాల మహిళలకు వివిధ రంగాల్లో శిక్షణ ఇచ్చి, వారిని ఆర్థికంగా నిలబెట్టడమే ఈ కేంద్రం ప్రధాన లక్ష్యం. అయితే ప్రారంభించిన కొద్ది కాలానికే అధికారులు దీని నిర్వహణను గాలికి వదిలేశారు.
ప్రస్తుతం ఈ భవనానికి తాళం పడి ఉండటంతో పరిసరాలు చెట్లు, పొదలతో అడవిని తలపిస్తున్నాయి. భవనం గోడలకు పగుళ్లు వచ్చి ఏ క్షణాన కూలుతుందో తెలియని స్థితికి చేరింది. ప్రజాధనం ఇలా వృథాగా మారుతున్నా సంబంధిత శాఖ అధికారులు పట్టించుకోకపోవడంపై స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
శిథిలావస్థకు చేరిన ఈ CLRC భవనానికి వెంటనే మరమ్మతులు చేపట్టి, మహిళా సంఘాలకు పునరుద్ధరించిన సేవలు అందుబాటులోకి తీసుకురావాలని గ్రామీణులు, స్థానిక మహిళలు డిమాండ్ చేస్తున్నారు.




