Nalgonda: పెట్రోల్ బంకుల దోపిడీ.. పవర్ పెట్రోల్ పేరుతో అదనపు వసూళ్లు!
Nalgonda: నల్లగొండలో సాధారణ పెట్రోల్ లేదంటూ లీటర్‌కు రూ.10 అదనంగా వసూలు చేస్తూ పవర్ పెట్రోల్ బలవంతంగా అమ్ముతున్నారని వాహనదారులు ఆరోపిస్తున్నారు. తక్షణ చర్యలు తీసుకోవాలి.
Nalgonda: పెట్రోల్ బంకుల దోపిడీ.. పవర్ పెట్రోల్ పేరుతో అదనపు వసూళ్లు!
Nalgonda: నల్లగొండ పట్టణంలోని పలు పెట్రోల్ బంకుల నిర్వాహకులు సాధారణ పెట్రోల్ 'నో స్టాక్' అంటూ వాహనదారులను నిలువు దోపిడీ చేస్తున్నారు.
బోర్డులు పెట్టకుండానే కేవలం 'పవర్ పెట్రోల్' మాత్రమే ఉందంటూ నింపుతూ, లీటర్‌కు రూ.10 అదనంగా వసూలు చేస్తున్నారు. ప్రశ్నిస్తే సిబ్బంది నిర్లక్ష్యంగా సమాధానమిస్తున్నారని, విజిలెన్స్ అధికారులు తక్షణమే స్పందించి ఈ దోపిడీని అరికట్టాలని వాహనదారులు డిమాండ్ చేస్తున్నారు.




