Nuthankal: నూతనకల్‌లో పోలీస్ ప్రజా భరోసా అవగాహన కార్యక్రమం!
Nuthankal: నూతనకల్‌లో పోలీస్ ప్రజా భరోసా అవగాహన కార్యక్రమం. వినాయక చవితి ఉత్సవాల ముందస్తు జాగ్రత్తలు, ట్రాఫిక్ నిబంధనలపై ఎస్సై నాగరాజు సూచనలు.
Nuthankal: నూతనకల్‌లో పోలీస్ ప్రజా భరోసా అవగాహన కార్యక్రమం!
Nuthankal: నూతనకల్ మండల కేంద్రంలో బుధవారం పోలీస్ శాఖ ఆధ్వర్యంలో 'ప్రజా భరోసా' అవగాహన కార్యక్రమం నిర్వహించారు.ఈ సందర్భంగా ఎస్సై నాగరాజు స్థానిక ప్రజలకు శాంతిభద్రతలు, సామాజిక అంశాలపై అవగాహన కల్పించారు. త్వరలో రానున్న వినాయక చవితి ఉత్సవాల నేపథ్యంలో కాలనీవాసులు, ఉత్సవ కమిటీ సభ్యులు ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. పండుగను భక్తిశ్రద్ధలతో, ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు లేకుండా ప్రశాంతంగా జరుపుకోవాలని కోరారు.
గ్రామాల్లో శాంతిభద్రతలు కాపాడటంతో పాటు మతసామరస్యాన్ని పెంపొందించేందుకు అందరూ సహకరించాలని విజ్ఞప్తి చేశారు. రోడ్డు ప్రమాదాల నివారణకు వాహనదారులు తప్పనిసరిగా ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని, లైసెన్స్, హెల్మెట్ తప్పనిసరిగా ధరించాలని స్పష్టం చేశారు. ఉత్సవాల సమయంలో ధ్వని కాలుష్యం నివారించాలని, విద్యుత్ వినియోగంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ప్రజలను అప్రమత్తం చేశారు.
ఈ కార్యక్రమంలో స్థానిక పోలీస్ సిబ్బంది, కాలనీ పెద్దలు, యువకులు మరియు పెద్ద సంఖ్యలో ప్రజలు పాల్గొన్నారు.




