Suryapet: 227 కేజీల గంజాయిని బూడిద చేసిన పోలీసులు.. ఎస్పీ నరసింహ!

Suryapet: రూ.1 కోటి పైగా విలువైన 227.18 కేజీల గంజాయిని జిల్లా పోలీసులు కోర్టు ఉత్తర్వుల మేరకు బూడిద చేశారు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇక్కడ చదవండి.

PULUSU NAGARAJU, SURYAPETA
Updated on: 30 Jun 2026 12:53 PM IST
Suryapet
X

Suryapet: 27 కేజీల గంజాయిని బూడిద చేసిన పోలీసులు: ఎస్పీ నరసింహ!

సూర్యాపేట: వివిధ కేసుల్లో స్వాధీనం చేసుకున్న 227.18 కేజీల గంజాయిని జిల్లా పోలీసులు సోమవారం బూడిద చేశారు.

జిల్లా ఎస్పీ కె. నరసింహ ఐపిఎస్ తెలిపిన వివరాల ప్రకారం, 29 కేసుల్లో పట్టుబడిన ఈ గంజాయిని ప్రభుత్వ, కోర్టు ఉత్తర్వుల మేరకు జిల్లా డ్రగ్ డిస్పోజల్ కమిటీ ఆధ్వర్యంలో నిర్వీర్యం చేశారు.

యాదాద్రి జిల్లా తుక్కాపుర్ గ్రామంలోని రోమా ఇండస్ట్రీస్‌లో అత్యాధునిక సాధనాలతో, ప్రభుత్వ సాక్షుల సమక్షంలో గంజాయిని బూడిద చేశారు. దీని విలువ రూ. 1 కోటి పైగా ఉంటుందని ఎస్పీ తెలిపారు. పర్యావరణానికి, ప్రజా ఆరోగ్యానికి ఎలాంటి హానీ కలగకుండా అన్ని జాగ్రత్తలు తీసుకున్నట్లు వెల్లడించారు.

ఈ సందర్భంగా ఎస్పీ నరసింహ మాట్లాడుతూ డ్రగ్స్, గంజాయి వినియోగం యువత భవిష్యత్తును నాశనం చేస్తోందని, వాటి రవాణా, వినియోగం చట్టరీత్యా నేరమని హెచ్చరించారు.

డ్రగ్స్ నివారణ అందరి సామాజిక బాధ్యత అని, గంజాయి అమ్మకం, రవాణా, వినియోగం గురించి 100, 112, 1908 నంబర్లకు సమాచారం ఇవ్వాలని కోరారు. గంజాయి వినియోగించే వారిని, వ్యాపారం చేసే వారిని గుర్తించి కౌన్సిలింగ్ ఇస్తున్నామని తెలిపారు. తల్లిదండ్రులు పిల్లల అలవాట్లను గమనిస్తూ చెడు వ్యసనాలకు లోనుకాకుండా చూడాలని సూచించారు.

ఈ కార్యక్రమంలో జిల్లా డ్రగ్ డిస్పోజల్ కమిటీ సభ్యులు సూర్యాపేట డిఎస్పీ ప్రసన్న కుమార్, కోదాడ డిఎస్పీ శ్రీనివాస్ రెడ్డి, క్రైమ్ రికార్డ్ బ్యూరో డిఎస్పీ రవి, ఏఆర్ డిఎస్పీ నరసింహ, ఎస్ఐలు యాకూబ్, జాన్సీరాణి తదితరులు పాల్గొన్నారు

PULUSU NAGARAJU, SURYAPETA

PULUSU NAGARAJU, SURYAPETA

Next Story