Suryapet: సూర్యాపేటలో ఘనంగా పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవం!

Suryapet: సూర్యాపేట జిల్లా కేంద్రంలో ఘనంగా పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవం. అమరుల స్థూపం వద్ద నివాళులర్పించిన ఎస్పీ కె. నరసింహ ఐపీఎస్.

PULUSU NAGARAJU, SURYAPETA
Published on: 21 Oct 2026 11:26 AM IST
Suryapet
X

Suryapet: సూర్యాపేటలో ఘనంగా పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవం!

Suryapet: శాంతిభద్రతల పరిరక్షణలో ప్రాణాలర్పించిన పోలీస్ అమరుల సేవలను ఎప్పటికీ మరువలేమని సూర్యాపేట జిల్లా ఎస్పీ కె. నరసింహ ఐపీఎస్ అన్నారు.

జిల్లా కేంద్రంలోని పోలీస్ పరేడ్ గ్రౌండ్ లో పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. పోలీస్ అమరవీరుల స్థూపానికి ఎస్పీ పూలమాలలు వేసి శ్రద్ధాంజలి ఘటించారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ ఎస్పీ రవీందర్ రెడ్డితో పాటు జిల్లా పోలీస్ అధికారులు, సిబ్బంది పెద్ద సంఖ్యలో పాల్గొని అమరులకు వందనం సమర్పించారు.

ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. సమాజంలో శాంతిభద్రతల పరిరక్షణ, ప్రజా సేవలో పోలీసులు చేసిన త్యాగాలు వెలకట్టలేనివని అన్నారు. విధి నిర్వహణలో ప్రాణాలను సైతం లెక్కచేయకుండా ప్రజల రక్షణ కోసం నిరంతరం శ్రమిస్తున్న పోలీసుల సేవలను ప్రతి ఒక్కరూ గుర్తించాలని కోరారు.

గత ఏడాది కాలంలో దేశవ్యాప్తంగా విధి నిర్వహణలో అసువులు బాసిన అమరవీరులతో పాటు, సూర్యాపేట జిల్లాకు సంబంధించి విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోయిన కానిస్టేబుల్ శ్రీలక్ష్మీ కమలాకర్, గతంలో వివిధ సంఘటనల్లో ప్రాణాలు అర్పించిన పోలీస్ అధికారుల త్యాగాలను స్మరించుకున్నారు. వారి ఆశయాలకు అనుగుణంగా నడుచుకోవడమే మనం వారికిచ్చే నిజమైన నివాళి అని ఎస్పీ అన్నారు.

PULUSU NAGARAJU, SURYAPETA

PULUSU NAGARAJU, SURYAPETA