Kethepally: పోలీస్ స్టేషన్‌లో అగ్నిప్రమాదం తగలబడుతున్న సీజ్డ్ వాహనాలు!
Kethepally: నల్లగొండ జిల్లా కేతపల్లి పోలీస్ స్టేషన్ ఆవరణలో భారీ అగ్నిప్రమాదం జరిగింది.
Kethepally: పోలీస్ స్టేషన్‌లో అగ్నిప్రమాదం తగలబడుతున్న సీజ్డ్ వాహనాలు!
కేతపల్లి: నల్లగొండ జిల్లా కేతపల్లి పోలీస్ స్టేషన్ ఆవరణలో బుధవారం భారీ ప్రమాదం చోటుచేసుకుంది. వివిధ కేసుల్లో పోలీస్ స్టేషన్లో సీజ్ చేసి ఉంచిన వాహనాల్లో అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. క్షణాల వ్యవధిలోనే మంటలు పక్కనే ఉన్న ఇతర వాహనాలకు కూడా వ్యాపించడంతో స్టేషన్ పరిసరాల్లో తీవ్ర కలకలం రేగింది.
ఘటనపై సమాచారం అందుకున్న వెంటనే అగ్నిమాపక సిబ్బంది ఫైర్ ఇంజన్‌తో క్షేత్రస్థాయికి చేరుకున్నారు. ప్రస్తుతం సిబ్బంది తీవ్రంగా శ్రమించి మంటలను అదుపులోకి తెచ్చేందుకు చర్యలు చేపట్టారు. కాగా, ప్రమాదానికి గల కారణాలు, ఎంతమేర ఆస్తి నష్టం సంభవించిందనే వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.
Next Story




