Nalgonda: అక్టోబర్ 1 నుంచి మూడు రోజుల పాటు వైభవంగా ఉర్సు వేడుకలు!

Nalgonda: నల్లగొండలో అక్టోబర్ 1 నుంచి ప్రారంభమయ్యే హజ్రత్ సయ్యద్ షా లతీఫ్ ఉల్లా ఖాద్రీ ఉర్సు-ఏ-షరీఫ్ వేడుకల పోస్టర్‌ను మాజీ మున్సిపల్ చైర్మన్ బుర్రి శ్రీనివాస్ రెడ్డి ఆవిష్కరించారు.

Saleem, Nalgonda
Published on: 26 Sept 2026 5:43 PM IST
Nalgonda
X

Nalgonda: అక్టోబర్ 1 నుంచి మూడు రోజుల పాటు వైభవంగా ఉర్సు వేడుకలు!

Nalgonda: నల్లగొండలో ప్రసిద్ధి చెందిన హజ్రత్ సయ్యద్ షా లతీఫ్ ఉల్లా ఖాద్రీ రహ్మతుల్లాహి అలైహి ఉర్సు-ఏ-షరీఫ్ వేడుకల పోస్టర్‌ను మాజీ మున్సిపల్ చైర్మన్ బుర్రి శ్రీనివాస్ రెడ్డి, జడ్పిటిసి గుమ్ముల మోహన్ రెడ్డి నేడు ఆవిష్కరించారు. అక్టోబర్ 1 నుంచి మూడు రోజుల పాటు ఈ వేడుకలను అత్యంత వైభవంగా నిర్వహించనున్నారు.

​మూడు రోజుల ఉత్సవాల వివరాలు ​మొదటి రోజు: మదీనా మసీదు నుండి గంధం ఊరేగింపు, భక్తిశ్రద్ధలతో ప్రత్యేక ప్రార్థనలు.​రెండో రోజు: దర్గా వద్ద శోభాయమానంగా దీపాలంకరణ, ప్రత్యేక దువాలు. మూడో రోజు: భక్తులను అలరించేలా ఘనంగా ఖవ్వాలి కార్యక్రమం.

​తెలంగాణతో పాటు పొరుగు రాష్ట్రాల నుంచి కూడా భారీగా భక్తులు వచ్చే అవకాశం ఉండటంతో వారికి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా తాగునీరు, విద్యుత్, మౌలిక సదుపాయాల ఏర్పాట్లను ఉర్సు కమిటీ వేగవంతం చేసింది. ఈ కార్యక్రమంలో నల్గొండ పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు ఎడ్ల శ్రీనివాస్ యాదవ్, కార్పొరేటర్లు, ఉర్సు కమిటీ సభ్యులు, ఇనాందార్లు, ముతవల్లీలు మరియు ముస్లిం పెద్దలు పాల్గొన్నారు.

Saleem, Nalgonda

Saleem, Nalgonda