Huzurnagar: హుజూర్‌నగర్ భూ అక్రమాలపై విచారణ జరపాలి: కొండ హరీష్ గౌడ్

Huzurnagar: హుజూర్‌నగర్‌లో ప్రభుత్వ, దేవాదాయ భూముల అక్రమ రిజిస్ట్రేషన్లపై సమగ్ర విచారణ జరిపి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని బీజేపీ నేత కొండ హరీష్ గౌడ్ డిమాండ్ చేశారు.

DONTHAGANI RAJA RAMESH, HUZUR NAGAR
Published on: 24 Oct 2026 3:50 PM IST
Huzurnagar
X

Huzurnagar: హుజూర్‌నగర్ భూ అక్రమాలపై విచారణ జరపాలి: కొండ హరీష్ గౌడ్

హుజూర్‌నగర్‌: పట్టణంలో దేవాదాయ, ప్రభుత్వ, సీలింగ్‌, ఎన్‌ఎస్‌పీ కెనాల్‌ భూముల ఆక్రమణలు, అక్రమ రిజిస్ట్రేషన్లపై బీజేపీ చేసిన పోరాటం ఫలితంగానే ఎమ్మార్వో, ఆర్‌ఐ, జీపీఓ అధికారుల సస్పెన్షన్‌ జరిగిందని బీజేపీ పట్టణ అధ్యక్షుడు కొండ హరీష్ గౌడ్ అన్నారు.

అధికారుల సస్పెన్షన్‌ను ప్రజా విజయంగా అభివర్ణించారు. భూ అక్రమాలపై సమగ్ర విచారణ జరిపి బాధ్యులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని, బాధిత పేదలకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. భూ ఆక్రమణల వెనుక స్థానిక మంత్రి, అధికార పార్టీ నాయకుల ప్రమేయం ఉందని ఆరోపించారు. ప్రభుత్వ భూముల పరిరక్షణ కోసం బీజేపీ పోరాటం కొనసాగిస్తుందని తెలిపారు.

ఈ సమావేశంలో బీజేపీ జిల్లా నాయకులు బెల్లంకొండ నరేష్ గౌడ్, పిడమర్తి చంద్రయ్య, కంటు నాగరాజు, గుండా గోపి, రాళ్లబండి రామారావు తదితర నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

DONTHAGANI RAJA RAMESH, HUZUR NAGAR

DONTHAGANI RAJA RAMESH, HUZUR NAGAR