Nalgonda: తెలంగాణ ఆవిర్భావానికి జయశంకర్ సిద్ధాంతాలే పునాది!

Nalgonda: తెలంగాణ రాష్ట్ర సిద్ధాంతకర్త ప్రొఫెసర్ జయశంకర్ సార్ జయంతి సందర్భంగా నల్లగొండలో జిల్లా పరిషత్ మాజీ చైర్మన్ బండా నరేందర్ రెడ్డి ఘనంగా నివాళులర్పించారు.

Saleem, Nalgonda
Published on: 6 Aug 2026 11:54 AM IST
Nalgonda
X

Nalgonda: తెలంగాణ ఆవిర్భావానికి జయశంకర్ సిద్ధాంతాలే పునాది!

Nalgonda: తెలంగాణ రాష్ట్ర సిద్ధాంతకర్త ప్రొఫెసర్ జయశంకర్ సార్ జయంతి సందర్భంగా నల్లగొండ మున్సిపల్ కార్యాలయం పక్కన ఉన్న ఆయన విగ్రహానికి జిల్లా పరిషత్ మాజీ చైర్మన్ బండా నరేందర్ రెడ్డి, ఇతర బిఆర్ఎస్ నాయకులతో కలిసి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.

​ఈ సందర్భంగా బండా నరేందర్ రెడ్డి మాట్లాడుతూ, విద్యార్థి దశ నుంచే తెలంగాణ రాష్ట్ర సాధన కోసం జయశంకర్ సార్ అహర్నిశలు కృషి చేశారని గుర్తుచేసుకున్నారు. ఆయన చూపిన మార్గం, సిద్ధాంతాలే తెలంగాణ ఆవిర్భావానికి పునాదిగా నిలిచాయని కొనియాడారు. ఉద్యమ కాలంలో కేసీఆర్‌కు వెన్నుదన్నుగా నిలిచి సంపూర్ణ సహకారం అందించారని తెలిపారు.

Saleem, Nalgonda

Saleem, Nalgonda

Next Story