Suryapet: చింతలపాలెంలో 9వ రోజుకు చేరిన జెన్కో కార్మికుల ఆమరణ దీక్ష!
Suryapet: సూర్యాపేట జిల్లా చింతలపాలెంలో పులిచింతల జెన్కో ఆర్టిజన్ కార్మికుల ఆమరణ దీక్ష 9వ రోజుకు చేరింది. తమను ఉద్యోగాల్లోకి తీసుకోవాలని డిమాండ్.
Suryapet: చింతలపాలెంలో 9వ రోజుకు చేరిన జెన్కో కార్మికుల ఆమరణ దీక్ష!
Suryapet: చింతలపాలెం మండలంలో పులిచింతల ప్రాజెక్టు జెన్కో ఆర్టిజన్ కార్మికుల ఆమరణ దీక్ష తొమ్మిదో రోజుకు చేరుకుంది. వజినేపల్లి గ్రామ శివారులోని ఆంజనేయస్వామి దేవస్థానం వద్ద కార్మికులు దీక్ష కొనసాగిస్తున్నారు.తమ భూములను తీసుకుని కాంట్రాక్టు పద్ధతిలో కార్మికులుగా చేర్చుకుని శ్రమ దోపిడీ చేశారని, అనంతరం ఎలాంటి న్యాయం చేయకుండా ఉద్యోగాల నుంచి తొలగించారని కార్మికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఆర్టిజన్ కార్మికులుగా ఉద్యోగాలు కల్పించి తమకు న్యాయం చేయాలని వారు ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు. ఇదిలా ఉండగా, కార్మికులకు మద్దతు తెలిపేందుకు వస్తున్న జేఏసీ నాయకులను పోలీసులు అడ్డుకున్నారు.
పోలీస్ శాఖ వ్యవహారం పట్ల తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేసిన ఆర్టిజన్ జేఏసీ నాయకులు మాట్లాడుతూ కాంట్రాక్టు కార్మికులను వెంటనే ఆర్టిజన్ కార్మికులు గుర్తించి విధుల్లోకి తీసుకోవాలని లేని పక్షంలో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపడతామని తెలిపారు.
రాష్ట్ర ప్రభుత్వం వెంటనే స్పందించి సమస్యను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర మంత్రివర్యులు ప్రభుత్వ పెద్దలు తమ సమస్యను సత్వరమే పరిష్కరించి న్యాయం చేయకపోతే ఆమరణ దీక్ష కొనసాగిస్తామని ఈ సందర్భంగా తమ ప్రాణం పోయినా లెక్కచేయమని కార్మికులు స్పష్టం చేశారు.




