Nakrekal: నకిరేకల్ మెయిన్ సెంటర్‌లో కాంగ్రెస్ శ్రేణుల సంబరాలు

Nakrekal: నకిరేకల్ పట్టణ మెయిన్ సెంటర్‌లో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి.

BHUPATHI GOPI, NAKREKAL
Published on: 19 Jun 2026 11:36 AM IST
Nakrekal
X

Nakrekal: నకిరేకల్ మెయిన్ సెంటర్‌లో కాంగ్రెస్ శ్రేణుల సంబరాలు

నకిరేకల్: భావి భారత ప్రధాని, కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ జన్మదిన సందర్భంగా నకిరేకల్ పట్టణ మెయిన్ సెంటర్‌లో కేక్ కట్ చేసి ఘనంగా వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ప్రభుత్వ విప్, నకిరేకల్ శాసనసభ్యులు వేముల వీరేశం ముఖ్య అతిథిగా హాజరై కేక్ కట్ చేశారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే వేముల వీరేశం , "దేశ ప్రజల సమస్యలపై నిరంతరం పోరాడుతున్న యువ నాయకుడు రాహుల్ గాంధీ.. ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం ఆయన చేస్తున్న కృషి అభినందనీయం" అని కొనియాడారు. అనంతరం పార్టీ నాయకులు, కార్యకర్తలతో కలిసి కేక్ కట్ చేసి స్వీట్లు పంచిపెట్టారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, యువజన, మహిళా విభాగం నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

BHUPATHI GOPI, NAKREKAL

BHUPATHI GOPI, NAKREKAL

Next Story