Thungathurthy: రూ. 99 టోకెన్‌తో పొట్టేలు లక్కీడ్రా సూర్యాపేట జిల్లా వార్తలు!
Thungathurthy: తుంగతుర్తి సూర్యాపేట జిల్లా గొట్టిపర్తిలో దసరా సందర్భంగా స్నేహమండలి యూత్ వినూత్న లక్కీ డ్రా ప్రకటించింది. రూ.99 టోకెన్‌తో పొట్టేలు గెలుచుకునే అవకాశం.
Thungathurthy: రూ. 99 టోకెన్‌తో పొట్టేలు లక్కీడ్రా సూర్యాపేట జిల్లా వార్తలు!
Thungathurthy: దసరా పండుగను పురస్కరించుకుని సూర్యాపేట జిల్లాలోని తుంగతుర్తి మండలం గొట్టిపర్తి గ్రామంలో వినూత్న లక్కీడ్రా నిర్వహణకు స్నేహమండలి యూత్ సభ్యులు ఏర్పాట్లు చేస్తున్నారు. కేవలం రూ.99 టోకెన్‌తో లక్కీడ్రాలో పాల్గొని ఆకర్షణీయమైన బహుమతులు గెలుచుకునే అవకాశాన్ని కల్పిస్తున్నారు.ఈ లక్కీడ్రాలో మొదటి బహుమతిగా పొట్టేలు, రెండో బహుమతిగా బ్లెండర్స్ ప్రైడ్ ఫుల్ బాటిల్, మూడో బహుమతిగా రెండు నాటుకోళ్లను ప్రకటించారు.
ఈ నెల 19వ తేదీన ఉదయం 11 గంటలకు లక్కీడ్రాను ఘనంగా నిర్వహించేందుకు నిర్వాహకులు సిద్ధమవుతున్నారు. దసరా పండుగ నేపథ్యంలో గ్రామీణ ప్రాంతాల్లో సందడి నెలకొనగా, గొట్టిపర్తిలో నిర్వహించనున్న ఈ లక్కీడ్రాపై గ్రామస్తులు ఆసక్తి చూపుతున్నారు. రూ.99 టోకెన్లను కొనుగోలు చేసేందుకు పలువురు ముందుకు వస్తున్నట్లు తెలుస్తోంది. వినూత్న బహుమతులతో లక్కీడ్రా గ్రామంలో చర్చనీయాంశంగా మారింది.దసరా వేడుకల్లో భాగంగా నిర్వహిస్తున్న స్నేహమండలి.




