Chandampet: చందంపేట మండలంలో దారుణ హత్య.. రక్తపు మడుగులో నర్సింహ శవం!

Chandampet: నల్గొండ జిల్లా చందంపేట మండలం బిల్డింగ్ తండాకు చెందిన రమావత్ నర్సింహ కోరుట్ల సమీపంలో దారుణ హత్యకు గురయ్యారు.

హెచ్ఎం డిజిటల్ డెస్క్
Published on: 20 May 2026 12:42 PM IST
Chandampet
X

Chandampet: చందంపేట మండలంలో దారుణ హత్య.. రక్తపు మడుగులో నర్సింహ శవం!

చందంపేట: మండల పరిధిలో ఘోరం జరిగింది. బిల్డింగ్ తండా (పోలేపల్లి) గ్రామానికి చెందిన రమావత్ నర్సింహ (48) అనే వ్యక్తిని గుర్తుతెలియని దుండగులు దారుణంగా హత్య చేశారు. ​స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. మంగళవారం రాత్రి కోరుట్ల గ్రామ సమీపంలో ఈ ఘాతుకం చోటుచేసుకుంది. బుధవారం ఉదయం గమనించిన గ్రామస్థులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని, మృతదేహాన్ని పరిశీలించారు. పాత కక్షలేమైనా కారణమా లేక మరేదైనా వివాదమా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. దుండగుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు.

హెచ్ఎం డిజిటల్ డెస్క్

హెచ్ఎం డిజిటల్ డెస్క్

Next Story