Gauripally: ఇంటింటికి మొక్కల పంపిణీ: ఘనంగా హరితహారం కార్యక్రమం

Gauripally: తలకొండపల్లి మండలం గౌరిపల్లి, గౌరిపల్లితండాలలో సర్పంచ్ కళ్యాణ్ నాయక్, ఉపసర్పంచ్ రమేష్ యాదవ్ ఆధ్వర్యంలో ఇంటింటికి మొక్కల పంపిణీ ఘనంగా జరిగింది.

SRI SAILAM, KALWAKURTHY
Published on: 4 Aug 2026 11:57 AM IST
Gauripally
X

Gauripally: ఇంటింటికి మొక్కల పంపిణీ: ఘనంగా హరితహారం కార్యక్రమం

గౌరిపల్లి గ్రామ పంచాయతీలో ఇంటింటికి మొక్కలు పంపిణీ

రంగారెడ్డి జిల్లా తలకొండపల్లి మండలం

గౌరిపల్లి గ్రామం ఆగస్టు 4 : హరితహారం కార్యక్రమంలో భాగంగా ఈరోజు గౌరిపల్లి, గౌరిపల్లితండా లో మొక్కల పంపిణీ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు.

ఈ సందర్భంగా గ్రామ సర్పంచ్ కళ్యాణ్ నాయక్ మరియు ఉపసర్పంచ్ రమేష్ యాదవ్ గ్రామంలోని ప్రతి ఇంటికి వెళ్లి మొక్కలను పంపిణీ చేశారు. ప్రతి కుటుంబం కనీసం ఒక మొక్కను నాటి, దానిని సంరక్షించి గ్రామాన్ని పచ్చదనంతో నింపాలని గ్రామ ప్రజలకు పిలుపునిచ్చారు.

ఈ కార్యక్రమంలో గ్రామ కార్యదర్శి అరుణజ్యోతి,మాజీ సర్పంచ్ నరేందర్ గౌడ్, వార్డు సభ్యులు, గ్రామ పెద్దలు మరియు గ్రామస్తులు పాల్గొని మొక్కల పంపిణీలో భాగస్వాములయ్యారు. గ్రామ ప్రజలు కూడా ఉత్సాహంగా పాల్గొని హరితహారం కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.

SRI SAILAM, KALWAKURTHY

SRI SAILAM, KALWAKURTHY

Next Story