Nalgonda: నల్గొండలో గ్రాడ్యుయేట్ ఓటు నమోదు జోరు

Nalgonda: నల్గొండలో గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఓటు నమోదు ముమ్మరంగా సాగుతోంది. పూర్తి చేసిన ఫారాలను మాజీ మంత్రి జగదీశ్ రెడ్డికి యువత అందజేశారు.

PARAMESH, NALGONDA & SURYAPET
Published on: 25 Oct 2026 8:19 PM IST
Nalgonda
X

Nalgonda: నల్గొండలో గ్రాడ్యుయేట్ ఓటు నమోదు జోరు

నల్లగొండ జిల్లా: గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో నల్గొండ పట్టణంలో ఓటు నమోదు ప్రక్రియ అత్యంత ఉత్సాహంగా సాగుతోంది. శనివారం నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమంలో యువత, విద్యావంతులు స్వచ్ఛందంగా పాల్గొని తమ ఓట్లను నమోదు చేసుకున్నారు.​ అనంతరం మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి క్యాంప్ కార్యాలయంలో మాజీ మంత్రి, ఎమ్మెల్యే గుంటకండ్ల జగదీశ్ రెడ్డిని కలసి పూర్తి చేసిన ఫారాలను అందజేశారు.

ఈ సందర్భంగా జగదీశ్ రెడ్డి మాట్లాడుతూ... కాంగ్రెస్ ప్రభుత్వ మోసపూరిత వాగ్దానాలను నిలదీసేలా గ్రాడ్యుయేట్లు చైతన్యవంతంగా ఓటు హక్కు వినియోగించుకోవాలని పిలుపునిచ్చారు.​ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ మంకెన కోటిరెడ్డి, మాజీ ఎమ్మెల్యే భూపాల్ రెడ్డి, మాజీ మున్సిపల్ చైర్మన్ మందడి సైదిరెడ్డి, మారగోని భవాని గణేష్, రావుల శ్రీనివాసరెడ్డి, పెండం ధనంజయ, గంజి రాజేందర్ తదితరులు పాల్గొన్నారు.

PARAMESH, NALGONDA & SURYAPET

PARAMESH, NALGONDA & SURYAPET