Kattangur: కట్టంగూరులో విషాదం.. డివైడర్‌ను ఢీకొన్న కారు, ఒకరు మృతి!

Kattangur: నల్గొండ జిల్లా కట్టంగూరులో ఘోర రోడ్డు ప్రమాదం. విజయవాడ-హైదరాబాద్ జాతీయ రహదారిపై డివైడర్‌ను ఢీకొన్న కారు.

PARAMESH, NALGONDA & SURYAPET
Published on: 4 Jun 2026 11:05 AM IST
Kattangur
X

Kattangur: కట్టంగూరులో విషాదం.. డివైడర్‌ను ఢీకొన్న కారు, ఒకరు మృతి!

నల్గొండ జిల్లా: కట్టంగూరు మండల కేంద్రంలోని 65వ జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. విజయవాడ నుంచి హైదరాబాద్ వైపు వెళ్తున్న ఓ ప్రయాణికుల కారు అదుపుతప్పి డివైడర్‌ను బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న శివరాత్రి వేణు అక్కడికక్కడే మృతి చెందగా, మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి.

సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని గాయపడిన వారిని చికిత్స నిమిత్తం సమీప ఆసుపత్రికి తరలించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం నకిరేకల్ ప్రభుత్వ ఆసుపత్రికి పంపించారు. ప్రమాదానికి అతివేగమే కారణమై ఉండొచ్చని పోలీసులు ప్రాథమికంగా భావిస్తున్నారు. మృతుడు శివరాత్రి వేణుకు భార్య, ఒక కుమారుడు ఉన్నారు.ప్రమాదంపై కేసు నమోదు చేసిన దర్యాప్తు చేస్తున్న పోలీసులు.

PARAMESH, NALGONDA & SURYAPET

PARAMESH, NALGONDA & SURYAPET

Next Story