Suryapet: డ్రైవర్ యాకయ్య కుటుంబానికి రూ.5 లక్షల బీమా చెక్కు అందజేత

Suryapet: ట్రాక్టర్ ప్రమాదంలో మృతి చెందిన మద్దిరాల డ్రైవర్ యాకయ్య కుటుంబానికి మాజీ మంత్రి జగదీష్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే గాదరి కిశోర్ రూ.5 లక్షల బీమా చెక్కును అందజేశారు.

Muragundla, Veeraiah, Tungathurthy
Published on: 27 Aug 2026 6:07 PM IST
Suryapet
X

Suryapet: డ్రైవర్ యాకయ్య కుటుంబానికి రూ.5 లక్షల బీమా చెక్కు అందజేత

సూర్యాపేట: ట్రాక్టర్ మల్టీ కొట్టి ప్రమాదంలో మృతి చెందిన మద్దిరాల మండల కేంద్రానికి చెందిన డ్రైవర్ కొడవళికంటి యాకయ్య కుటుంబానికి డ్రైవర్ ప్రమాద బీమా కింద మంజూరైన రూ.5 లక్షల చెక్కును మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే గుంటకండ్ల జగదీష్ రెడ్డి, తుంగతుర్తి మాజీ ఎమ్మెల్యే డా. గాదరి కిశోర్ కుమార్ అందజేశారు.

భారత రాష్ట్ర సమితి కార్మిక విభాగం తుంగతుర్తి నియోజకవర్గ ఇన్‌చార్జి గౌడిచర్ల సత్యనారాయణ గౌడ్ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో యాకయ్య భార్య కవితకు చెక్కును అందజేశారు. పొలం దున్నుతుండగా ట్రాక్టర్ పల్టీ కొట్టి యాకయ్య మృతి చెందడంతో ఆయన కుటుంబానికి ఈ బీమా మొత్తం మంజూరైంది.

ఈ సందర్భంగా జగదీష్ రెడ్డి మాట్లాడుతూ, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ 2015లో డ్రైవర్ల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని డ్రైవర్ ప్రమాద బీమా పథకాన్ని ప్రవేశపెట్టారని తెలిపారు. డ్రైవింగ్ లైసెన్స్ ఉన్న ట్రాన్స్‌పోర్ట్ డ్రైవర్లకు ఈ పథకం వర్తించేదని, ఆటో, కారు, లారీ తదితర వాహనాల డ్రైవర్లకు ప్రమాదవశాత్తు మరణం సంభవించినప్పుడు వారి కుటుంబాలకు ఆర్థిక భరోసా కల్పించడమే పథకం ఉద్దేశమన్నారు.

2015 నుంచి 2024 వరకు ఈ పథకం కొనసాగిందని, కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పథకాన్ని రద్దు చేసిందని జగదీష్ రెడ్డి విమర్శించారు. డ్రైవర్ల నుంచి లైసెన్స్, ఫిట్‌నెస్, రిజిస్ట్రేషన్, పన్నుల రూపంలో ప్రభుత్వం వివిధ రకాలుగా రుసుములు వసూలు చేస్తున్నప్పటికీ, వారి సంక్షేమానికి సంబంధించిన బీమా పథకాన్ని పునరుద్ధరించడంపై ప్రభుత్వం దృష్టి పెట్టడం లేదన్నారు.

అదేవిధంగా ఆటో డ్రైవర్లకు సంవత్సరానికి రూ.12 వేల భృతి ఇస్తామని హామీ ఇచ్చినప్పటికీ ఇప్పటి వరకు ఒక్క రూపాయి కూడా అందించలేదని ఆయన ఆరోపించారు. డ్రైవర్ల కుటుంబాలకు ఆర్థిక భరోసా కల్పించేలా ప్రమాద బీమా పథకాన్ని పునరుద్ధరించాలని డిమాండ్ చేశారు.

ఈ కార్యక్రమంలో మద్దిరాల మండల పార్టీ అధ్యక్షుడు ఎస్‌.ఏ. రజాక్, తిరుమలగిరి మున్సిపల్ చైర్మన్ సంకెపెల్లి రఘునందన్ రెడ్డి, మండల పార్టీ అధ్యక్షుడు కళ్లేట్లపల్లి ఉప్పలయ్య, గుండగాని సోమేశ్, దావుల వీరప్రసాద్, బెజ్జంకి శ్రీరాం రెడ్డి, పోలుమల్ల గ్రామ శాఖ అధ్యక్షుడు రేసు వెంకన్న, మండల యువజన అధ్యక్షుడు నల్ల మధు రెడ్డి, పాతూరి లింగారెడ్డి, ఏలేటి మల్లారెడ్డితో పాటు పలువురు నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Muragundla, Veeraiah, Tungathurthy

Muragundla, Veeraiah, Tungathurthy

Next Story