Nakrekal: జెడ్పీహెచ్‌ఎస్ లో విద్యార్థులకు డైరీలు, స్టడీ మెటీరియల్ పంపిణీ!
Nakrekal: నల్గొండ జిల్లా శాలిగౌరారం మండలం చిత్తలూరు ZPHS పాఠశాలలో పేరెంట్స్-టీచర్స్ సమావేశం నిర్వహించారు.
Nakrekal: జెడ్పీహెచ్‌ఎస్ లో విద్యార్థులకు డైరీలు, స్టడీ మెటీరియల్ పంపిణీ!
నకిరేకల్: శాలిగౌరారం మండలం చిత్తలూరు గ్రామంలోని ZPHS హైస్కూల్లో శనివారం పేరెంట్స్-టీచర్స్ సమావేశం ఘనంగా నిర్వహించారు.
దాతలు తూడి మధు, తూడి మోహన్, తూడి కృష్ణయ్య ఆధ్వర్యంలో పాఠశాల విద్యార్థులందరికీ డైరీలు, ఎగ్జామినేషన్ ప్యాడ్లు, పెన్నులు అందజేశారు. అలాగే పాఠశాలలో అత్యవసర సమయాల్లో ఉపయోగపడేందుకు అవసరమైన ఫస్ట్ ఎయిడ్ బాక్స్ పాఠశాల యాజమాన్యానికి అందజేశారు.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ZPHS హైస్కూల్ హెడ్మాస్టర్ R. జ్యోతి, శాలిగౌరారం మండలం మార్కెట్ కమిటీ చైర్మన్ పాదూరి శంకర్ రెడ్డి, చిత్తలూరు గ్రామ సర్పంచ్ గిరగాని వెంకన్న, మాజీ సర్పంచ్ బొమ్మగాని రవి, ప్రస్తుత ఉపసర్పంచ్ యనమల్ల శంకర్, అన్నపూర్ణ, చింతనూరి శ్రీరంగం ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు తల్లిదండ్రులు పాల్గొన్నారు.
Next Story




