Nalgonda: నల్లగొండ కలెక్టరేట్‌లో సర్వాయి పాపన్న జయంతి వేడుకలు!
Nalgonda: నల్లగొండ కలెక్టరేట్‌లో సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ 376వ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. పాపన్న పోరాట పటిమను ఆదర్శంగా తీసుకోవాలన్నారు.
Nalgonda: నల్లగొండ కలెక్టరేట్‌లో సర్వాయి పాపన్న జయంతి వేడుకలు!
Nalgonda: సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ ధైర్యసాహసాలు, పోరాట పటిమను నేటి తరం ఆదర్శంగా తీసుకోవాలని స్థానిక సంస్థల ఇన్‌చార్జి అదనపు కలెక్టర్ ప్రేమ్‌కరణ్ రెడ్డి పిలుపునిచ్చారు. మంగళవారం కలెక్టరేట్‌లో నిర్వహించిన పాపన్న 376వ జయంతి వేడుకల్లో ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. వెనుకబడిన వర్గాల హక్కుల కోసం ఆయన చేసిన కృషిని గుర్తుచేసుకున్నారు. బీసీ సంక్షేమాధికారి సంజీవ, గౌడ సంఘం నాయకులు రామరాజు, కాశయ్య, వెంకన్న తదితరులు పాల్గొన్నారు.
Next Story




