Devarakonda: కొండమల్లేపల్లి 11వ వార్డులో నూతన నల్లాల వ్యవస్థను ప్రారంభించిన సర్పంచ్!
Devarakonda: కొండమల్లేపల్లి 11వ వార్డులో తాగునీటి సమస్య తీర్చేందుకు వేయించిన బోరు బావుల నూతన నల్లాల కలెక్షన్లను సర్పంచ్ యుగేందర్ రెడ్డి ప్రారంభించారు.
Devarakonda: కొండమల్లేపల్లి 11వ వార్డులో నూతన నల్లాల వ్యవస్థను ప్రారంభించిన సర్పంచ్!
Devarakonda: కొండమల్లేపల్లి పట్టణం 11వ వార్డులో ప్రజలకు ఇంటి అవసరాల నిమిత్తం నీళ్ల సదుపాయం లేకపోవడంతో ఇబ్బందిగా మారింది. వార్డు నెంబర్ వస్కుల స్వప్న - శ్రీను, ఈ విషయం సర్పంచ్ గారి దృష్టికి తీసుకురాగా.. రెండు కొత్త బోర్లను వేయించడం జరిగింది. వేసిన బోర్లలో విజయవంతంగా నీళ్లు రావడంతో ఆ బోర్ల సహాయంతో పైపుల కలెక్షన్ ద్వారా నల్లాలను ఏర్పాటు చేయడం జరిగింది . ఈరోజు సర్పంచ్ పసునూరి యుగేందర్ రెడ్డి గారు ప్రారంభించడం జరిగింది.
తదనంతరం ఆయన మాట్లాడుతూ ఎల్ నినో ప్రభావం వలన నీటిని జాగ్రత్తగా వాడుకోవాలని తెలియజేసారు. కార్యక్రమంలో ఉప సర్పంచ్ కొడిదాల పద్మ - వెంకటయ్య వార్డ్ మెంబర్స్ వస్కుల స్వప్న - శ్రీను, బిజిలీ లింగం, అందుగుల పూజ - వెంకటయ్య, వస్కుల బక్కలయ్య మరియు కాశయ్య తదితరులు పాల్గొన్నారు.




