Chintapalli: చింతపల్లి దళిత మహిళా వీవోఏపై దాడి అట్రాసిటీ కేసు నమోదు!

Chintapalli: నల్లగొండ జిల్లా చింతపల్లి మండలం పీకే మల్లేపల్లిలో వీవోఏ మాధవిపై దాడి ఘటనపై పోలీసులు ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టం కింద కేసు నమోదు చేశారు.

PARAMESH, NALGONDA & SURYAPET
Published on: 3 Oct 2026 2:01 PM IST
Chintapalli
X

Chintapalli: చింతపల్లి దళిత మహిళా వీవోఏపై దాడి అట్రాసిటీ కేసు నమోదు!

Chintapalli: చింతపల్లి మండలంలో కలకలం రేపుతోంది. సంఘాలకు సంబంధించిన డబ్బుల వ్యవహారంలో తనపై వచ్చిన ఆరోపణలను ప్రశ్నించినందుకు పీకే మల్లేపల్లి గ్రామానికి చెందిన వీవోఏ గనిపల్లి మాధవిపై దుర్భాషలాడుతూ దాడికి పాల్పడినట్లు ఫిర్యాదు అందింది. ఈ ఘటనపై చింతపల్లి పోలీసులు ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టంతో పాటు భారతీయ న్యాయ సంహిత (బీఎన్‌ఎస్‌)లోని పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.

నల్లగొండ జిల్లా చింతపల్లి మండలం పీకే మల్లేపల్లి గ్రామపంచాయతీలో వీవోఏగా విధులు నిర్వహిస్తున్న గనిపల్లి మాధవిపై సంఘాలకు సంబంధించిన డబ్బుల విషయంలో కొందరు వ్యక్తులు ఆరోపణలు చేసినట్లు సమాచారం. ఈ నేపథ్యంలో గ్రామపంచాయతీ వద్ద తనపై ఆరోపణలు చేసిన వారిని మాధవి ప్రశ్నిస్తుండగా, గ్రామానికి చెందిన కుప్పల అమర్‌నాథ్‌ అనే వ్యక్తి తన పట్ల అవమానకరంగా ప్రవర్తిస్తూ దుర్భాషలాడి దాడికి పాల్పడినట్లు ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు ఎఫ్‌ఐఆర్‌లో పేర్కొన్న వివరాల ద్వారా తెలుస్తోంది.

ఎఫ్‌ఐఆర్‌లో పలు సెక్షన్లు నమోదు

బాధితురాలి ఫిర్యాదుపై చింతపల్లి పోలీస్‌స్టేషన్‌లో క్రైమ్‌ నంబర్‌ 172/2026గా కేసు నమోదు చేశారు. భారతీయ న్యాయ సంహితలోని సెక్షన్లు 74, 115(2), 352తో పాటు ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీస్‌ నిరోధక చట్టం, 2015లోని సెక్షన్లు 3(1)(r), 3(1)(s), 3(2)(va)లను ఎఫ్‌ఐఆర్‌లో పేర్కొన్నారు. అక్టోబర్‌ 2, 2026న మధ్యాహ్నం ఘటన జరిగినట్లు, సాయంత్రం పోలీసులకు ఫిర్యాదు అందినట్లు ఎఫ్‌ఐఆర్‌ వివరాలు సూచిస్తున్నాయి.

మహిళల గౌరవానికి భంగం కలిగిస్తే చర్యలు తప్పవా?

గ్రామంలో ఏదైనా ఆర్థిక వ్యవహారంపై ఆరోపణలు ఉంటే సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లి చట్టబద్ధంగా పరిష్కరించుకోవాల్సి ఉంటుంది. అంతేకానీ, బహిరంగంగా దుర్భాషలాడటం, దాడికి పాల్పడినట్లు ఆరోపణలు రావడం ఆందోళన కలిగిస్తోంది. ఈ ఘటనపై పోలీసులు సమగ్ర విచారణ జరిపి, చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది.

PARAMESH, NALGONDA & SURYAPET

PARAMESH, NALGONDA & SURYAPET