Nalgonda: నల్లగొండలో జనగణన చార్జ్ ఆఫీసర్లకు రెండో రోజు శిక్షణ!

Nalgonda: నల్లగొండ కలెక్టరేట్‌లో జనగణన నిర్వహణపై అధికారులకు రెండో రోజు శిక్షణా తరగతులు. ముఖ్య ప్రణాళిక అధికారి శ్రీనివాస్ నాయక్ ఆధ్వర్యంలో శిక్షణ!

Saleem, Nalgonda
Published on: 23 Oct 2026 3:21 PM IST
Nalgonda
X

Nalgonda: నల్లగొండలో జనగణన చార్జ్ ఆఫీసర్లకు రెండో రోజు శిక్షణ!

Nalgonda: జనగణన నిర్వహణపై జిల్లా, డివిజనల్ స్థాయి అధికారులు, చార్జ్ ఆఫీసర్లు, అదనపు చార్జ్ ఆఫీసర్లకు శుక్రవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో రెండో రోజు శిక్షణా తరగతులు నిర్వహించారు.

​ముఖ్య ప్రణాళిక అధికారి శ్రీనివాస్ నాయక్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో తహసీల్దార్లు (చార్జ్ ఆఫీసర్లు), ఎంపీడీవోలు, మున్సిపల్ కమిషనర్లు (అదనపు చార్జ్ ఆఫీసర్లు) పాల్గొన్నారు. జనగణన ప్రక్రియను సమర్థవంతంగా చేపట్టేందుకు అధికారులకు విధివిధానాలపై స్పష్టమైన అవగాహన కల్పించినట్లు ఆయన తెలిపారు.

Saleem, Nalgonda

Saleem, Nalgonda