Suryapet: సూర్యాపేటలో ఎస్ఐ, కానిస్టేబుల్ ఉచిత శిక్షణ ఎంపిక పరీక్ష!

Suryapet: సూర్యాపేటలో ఎస్ఐ, కానిస్టేబుల్ ఉద్యోగాల ఉచిత శిక్షణ కోసం ఆదివారం ఎంపిక పరీక్ష నిర్వహించారు. ఎస్పీ కె. నరసింహ పరీక్షా కేంద్రాన్ని సందర్శించారు.

PULUSU NAGARAJU, SURYAPETA
Published on: 4 Oct 2026 12:04 PM IST
Suryapet
X

Suryapet: సూర్యాపేటలో ఎస్ఐ, కానిస్టేబుల్ ఉచిత శిక్షణ ఎంపిక పరీక్ష!

Suryapet: ఎస్ఐ, కానిస్టేబుల్ ఉద్యోగాలకు సిద్ధమవుతున్న నిరుద్యోగ యువతకు సూర్యాపేట జిల్లా యంత్రాంగం, జిల్లా పోలీసుల ఆధ్వర్యంలో అందించనున్న 45 రోజుల ఉచిత శిక్షణకు అభ్యర్థుల ఎంపిక పరీక్షను ఆదివారం నిర్వహించారు.

జిల్లా వ్యాప్తంగా 4 కేంద్రాల్లో ఈ పరీక్ష జరిగింది. సూర్యాపేటలోని ఎస్వీ డిగ్రీ కళాశాల, కోదాడలోని కేఆర్ఆర్ డిగ్రీ కళాశాల, హుజూర్‌నగర్‌లోని గ్రీన్‌వుడ్ పాఠశాల, తిరుమలగిరి జిల్లా పరిషత్ పాఠశాలల్లో పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశారు.

సూర్యాపేట పట్టణంలోని ఎస్వీ డిగ్రీ కళాశాల పరీక్షా కేంద్రాన్ని జిల్లా ఎస్పీ కె. నరసింహ ఐపీఎస్ సందర్శించి పరీక్ష సరళిని పరిశీలించారు.

ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. జిల్లా కలెక్టర్ తేజస్ నంద లాల్ పవార్ ఐఏఎస్ ప్రత్యేక చొరవతో జిల్లా యంత్రాంగం, జిల్లా పోలీసుల ఆధ్వర్యంలో 45 రోజుల ఉచిత శిక్షణ నిర్వహిస్తున్నామని, అర్హులైన అభ్యర్థులను ఎంపిక చేసేందుకే ఈ పరీక్ష నిర్వహిస్తున్నామని తెలిపారు. ముందస్తు రిజిస్ట్రేషన్ ద్వారా 1600 మందికి పైగా అభ్యర్థులు నమోదు చేసుకోగా, నేడు 1220 మంది పరీక్షకు హాజరయ్యారని పేర్కొన్నారు. నిరుద్యోగ యువత ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని, ఇలాంటి శిక్షణ కార్యక్రమాల్లో పాల్గొని పోలీస్ ఉద్యోగాలతో పాటు ప్రభుత్వ ఉద్యోగాలు సాధించే దిశగా కృషి చేయాలని ఆకాంక్షించారు.

ఎస్పీ వెంట అదనపు కలెక్టర్ ట్రైనీ ఐఏఎస్ అనుషా, సూర్యాపేట డీఎస్పీ ప్రసన్న కుమార్, స్పెషల్ బ్రాంచ్ ఇన్‌స్పెక్టర్ రామారావు, పట్టణ ఇన్‌స్పెక్టర్ వెంకటయ్య, రిజర్వ్ ఇన్‌స్పెక్టర్ ప్రవీణ్ కుమార్, ఎస్సైలు, డిప్యూటీ ఎమ్మార్వో, పోలీసు సిబ్బంది తదితరులు ఉన్నారు.

PULUSU NAGARAJU, SURYAPETA

PULUSU NAGARAJU, SURYAPETA