Nalgonda: ఓటరు జాబితా ప్రత్యేక సవరణపై ఎంజీయూలో అవగాహన
Nalgonda: మహాత్మా గాంధీ విశ్వవిద్యాలయంలో ఓటరు జాబితా ప్రత్యేక సవరణపై రౌండ్ టేబుల్ సమావేశం. అర్హులైన ప్రతి ఒక్కరూ ఓటు హక్కు నమోదు చేసుకోవాలని డా. కేశవులు పిలుపు.
Nalgonda: ఓటరు జాబితా ప్రత్యేక సవరణపై ఎంజీయూలో అవగాహన
నల్గొండ: అర్హులైన ప్రతి ఒక్కరూ ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (సర్) అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సమాచార హక్కు పరిరక్షణ సమితి, ఎలక్షన్ వాచ్ కమిటీ జాతీయ ఛైర్మన్ డా. బొమ్మరబోయిన కేశవులు ముదిరాజ్ పిలుపునిచ్చారు. మహాత్మా గాంధీ విశ్వవిద్యాలయం (ఎంజీయూ), సమాచార హక్కు పరిరక్షణ సమితి, ఎలక్షన్ వాచ్ కమిటీ సంయుక్త ఆధ్వర్యంలో మంగళవారం వర్సిటీ సెమినార్ హాల్‌లో 'ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ'పై రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన డా. కేశవులు మాట్లాడుతూ.. కేంద్ర ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు పారదర్శక ఎన్నికల నిర్వహణ కోసం ఈ సమగ్ర సవరణ చేపట్టినట్లు తెలిపారు. గతంలో 2002లో జరిగిన ఈ ప్రక్రియ, మళ్లీ ఇన్నాళ్లకు ఇప్పుడే నిర్వహిస్తున్నారని పేర్కొన్నారు. ప్రజాస్వామ్యానికి ఎన్నికలే మూలస్తంభాలని, 18 ఏళ్లు నిండిన ప్రతి ఒక్కరూ ఓటు హక్కు కలిగి ఉండాలని స్పష్టం చేశారు.




