Nalgonda: నల్గొండలో రేపే జాతీయ లోక్‌ అదాలత్‌.. కేసుల పరిష్కారానికి సువర్ణావకాశం

Nalgonda: నల్గొండ జిల్లా కోర్టు భవన సముదాయంలోని న్యాయ సేవ సదన్‌లో శనివారం జాతీయ లోక్‌ అదాలత్‌ నిర్వహించనున్నారు.

హెచ్ఎం డిజిటల్ డెస్క్
Published on: 19 Jun 2026 5:58 PM IST
Nalgonda
X

Nalgonda: నల్గొండలో రేపే జాతీయ లోక్‌ అదాలత్‌.. కేసుల పరిష్కారానికి సువర్ణావకాశం

నల్గొండ: నల్గొండ జిల్లా కోర్టు భవన సముదాయంలోని న్యాయ సేవ సదన్‌లో శనివారం (జూన్‌ 20) ఉదయం 10:30 గంటల నుంచి ‘జాతీయ లోక్‌ అదాలత్‌’ నిర్వహించనున్నట్లు జిల్లా న్యాయ సేవాధికార సంస్థ సెక్రటరీ, ప్రధాన సీనియర్ సివిల్ జడ్జి పి. పురుషోత్తమ రావు తెలిపారు.

​రాష్ట్ర హైకోర్టు, రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థ ఆదేశాల మేరకు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. జిల్లా వ్యాప్తంగా వివిధ కోర్టుల్లో పెండింగ్‌లో ఉన్న అన్ని రకాల రాజీపడదగిన క్రిమినల్‌, సివిల్‌ కేసులతో పాటు, ప్రీ-లిటిగేషన్‌ కేసులను ఈ అదాలత్‌లో పరిష్కరించుకోవచ్చని తెలిపారు. కక్షిదారులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు.

హెచ్ఎం డిజిటల్ డెస్క్

హెచ్ఎం డిజిటల్ డెస్క్

Next Story